NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి.. ఉదయం 10.30కి ఈడీ ఆఫీసుకి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి.

* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

* ఇవాళ ఢిల్లీకి బండి సంజయ్.. ఎల్లుండి నుంచి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొననున్న బండి సంజయ్‌

* అనంతపురం: గుంతకల్ రైల్వే డివిజన్‌లో సిగ్నలింగ్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ధర్మవరం విజయవాడ మధ్య తిరిగే రైలు పాక్షికంగా రద్దు.

* నేడు విశాఖకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రెండు రోజుల పాటు నగరంలో పర్యటన

* ఏలూరు జిల్లా: పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ 16వ స్నాతకోత్సవంలో పాల్గొనున్న గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి రెండు రోజుల పాటు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిచే కొవ్వూరు సంస్కృత పాఠశాల ఆవరణలో దశ సహస్ర భగవద్గీత పారాయణం

* నేడు భద్రాచలం బంద్.. భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజించే జీవో నెంబర్ 45 రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు డిమాండ్.. భద్రాచలం గ్రామపంచాయతీ యథావిథిగా కొనసాగించాలని, పెసా చట్ట ప్రకారం, గ్రామ సభలు నిర్వహించకుండా, మూడు గ్రామ పంచాయతీలుగా విభజించడంపై అభ్యంతరం.

* వనపర్తి: నేడు జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డిల పర్యటన.. పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రులు

* గుడివాడ క్యాసినో ఎపిసోడుపై ఇవాళ ఐటీ విచారణ.. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు.. గుడివాడ క్యాసినో అంశమై కొడాలి నాని, వల్లభనేని వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు టీడీపీ ఫిర్యాదు.

Show comments