Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* మహిళల వన్డే వరల్డ్‌ కప్: నేడు ఇండియా వర్సెస్ సౌత్‌ ఆఫ్రికా.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వేదికగా మ్యాచ్‌

* ముంబైలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్‌ ప్రధాని కైర్ స్టార్మర్ సమావేశం.. వాణిజ్యం మరియు సాంకేతిక సంబంధాలపై చర్చ

* హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేయనున్న హైకోర్టు.. ఇవాళ మరిన్ని వాదనలు వినిపించనున్న ఏజీ

* కాకినాడ: నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై మత్స్యకారుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్న పవన్‌ కల్యాణ్.. మధ్యాహ్నం ఉప్పాడలో బహిరంగ సభలో మత్స్యకారుల అభిప్రాయాలు తెలుసుకుని, ప్రసంగించనున్న పవన్‌ కల్యాణ్‌

* కాకినాడ: నేడు ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన.. ఏఎస్పీ, ముగ్గురు డీసీపీలతో సహా 550 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు.. కలెక్టరేట్‌లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

* అన్నమయ్య జిల్లా: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో నేడు ఎక్సైజ్‌ పోలీసుల ఎదుట లొంగిపోనున్న కీలక నిందితుడు ఏ1 జనార్దన్‌రావు.. విదేశాల నుంచి ఇవాళ మధ్యాహ్నం విజయవాడకు రానున్న జనార్దన్‌రావు

* అమరావతి: నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలను పరిశీలించనున్న జగన్‌.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న గిరిజన విద్యార్థులకు పరామర్శ

* హైదరాబాద్‌: ఇవాళ తెంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు

* హైదరాబాద్‌: నేడు పార్టీ జిల్లా అధ్యక్షులతో టి.పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ జూమ్‌ మీటింగ్.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు, అభ్యర్థుల ఎంపికపై చర్చ

* హైదరాబాద్‌: ఇవాళ నామినేషన్లకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్‌.. నోటిఫికేషన్‌ విడుదల కాగానే నామినేషన్లు వేయాలని కాంగ్రెస్‌ నిర్ణయం

* హైదరాబాద్‌: ఇవాళ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో చలో బస్‌ భవన్‌ కార్యక్రమం.. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్‌ చలో బస్‌ భవన్‌.. పాల్గొననున్న కేటీఆర్, హరీష్‌రావు

* నేడు మిథున్‌రెడ్డి బెయిల్‌ రద్దు సిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. మిథున్‌రెడ్డికి గత నెల 28న లిక్కర్‌ కేసులో బెయిల్‌ ఇచ్చిన ఏసీబీ కోర్టు

* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,861 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు

* విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ రీ ఓపెన్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తీర్పు వెల్లడించవద్దని సిట్ పిటిషన్.. మరింత సమాచారంతో వాదనలు వినిపిస్తామని సిట్ పిటిషన్ పై నేడు విచారణ

Exit mobile version