* కొనసాగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. బ్రెజిల్ పర్యటన ముగించుకుని నమీబియా పర్యటనకు మోడీ.. నేటితో ముగియనున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటన..
* నేడు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్.. కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి-కార్మిక సంఘాలు
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్.. పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చ, కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
* ఇవాళ కూడా ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..
* నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. బంగారుపాళ్యంలో మామిడి రైతులకు జగన్ పరామర్శ.. ఉదయం 11.30కి రైతులతో జగన్ ముఖాముఖి
ఢిల్లీ: డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ స్థాపించి పదేళ్లు.. ఇవాళ వర్క్ షాప్.. ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హాజరుకానున్న దేశవ్యాప్తంగా గనులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల గనుల శాఖ కార్యదర్శులు
* హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి వివేక్
* విజయవాడ: నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అధ్యక్ష హోదాలో రానున్న మాధవ్.. ఉదయం 8.30కి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర ఆఫీస్ వరకు ర్యాలీ.. 10 గంటలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న మాధవ్
* విశాఖ: సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సర్వం సిద్ధం.. ఇవాళ, రేపు జరగనున్న 32 కిలోమీటర్ల ఆధ్యాత్మిక యాత్ర
* విజయవాడ: కనకదుర్గమ్మ ఆలయంలో నేడు రెండోరోజు శాకంబరీదేవి ఉత్సవాలు..
* నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం… ఇన్ ఫ్లో 1,16,424క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 4,646క్యూసెక్కులు.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 534.50అడుగులు..
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు సింగరేణి వ్యాప్తంగా సమ్మె కి పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు… సింగరేణి వ్యాప్తంగా 41000 మంది పర్మినెంట్, ఒప్పంద ఉద్యోగులు.. సింగరేణి వ్యాప్తంగా 38 గనులు.. రోజుకు బొగ్గు ఉత్పత్తి 206165 టన్నులు..
* నెల్లూరు: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో మీడియా ముందుకు రానున్న జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రసన్నకి అండగా ఉంటామనే భరోసా ఇవ్వనున్న నేతలు
* నెల్లూరు: ఇవాళ జిల్లాకి రానున్న మాదిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి.. SC కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా, అనంతరం దర్గా సందర్శన..
* అన్నమయ్య జిల్లా : నేడు నందలూరు శ్రీ సౌమ్య నాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా పగలు శేష వాహన సేవ, రాత్రి గరుడ వాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీ సౌమ్యనాథ స్వామి వారు
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.. నాలుగు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,85,781 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,72,520 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు.. కుడి,ఎడమ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
కర్నూలు….
* కర్నూలు: మంత్రాలయం మండలం రాంపురంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నేడు వైసీపీ నియోజకవర్గ సమావేశం… పాల్గొననున్న వైసిపి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి.
* తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,320 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,950 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు
