NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు మహారాష్ట్రలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.. మధ్యాహ్నం 12 గంటలకు దూలేలో ర్యాలీ.. 2 గంటలకు నాసిక్‌లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించనున్న మోడీ..

* తిరుమల: ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ.. రేపు మలయప్పస్వామికి పుష్పార్చన.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* ప్రకాశం : కంభంలో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..

* ప్రకాశం: కనిగిరి వ్యవసాయ కార్యాలయంలో రాయితీపై శెనగల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి..

* ప్రకాశం: మార్కాపురంలో రెండవ రోజు రెవిన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగనున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం..

* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం

* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* విశాఖ: నేడు GVMC స్థాయి సంఘం సమావేశం. 71 అంశాలతో కూడిన అజెండా పై చర్చ

* శ్రీ సత్యసాయి : పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో రెవెన్యూ గ్రామ సభలలో పాల్గొననున్న బీసీ సంక్షేమ చేనేత మంత్రి సవిత.

* అనంతపురం : ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు చలో ఐటీడీఏ కు పిలుపునిచ్చిన జీవో నెంబర్ 3 సాధన కమిటీ.. GO నెంబర్ 3కి చట్టబద్ధత, స్పెషల్ DSC ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆందోళన

* శ్రీ సత్యసాయి : బుక్కపట్నం చెరువుకు పర్యాటక శోభ… బోటింగ్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే సింధూరరెడ్డి.

* నంద్యాల: సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా నేడు ట్రయల్ రన్.. పాతాళగంగలో సీప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించినున్న అధికారులు

* రేపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీప్లేన్ లాంఛనంగా ప్రారంభించి సీప్లేన్ లో శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్న చంద్రబాబు

* ఏలూరు: నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చ..

* తూర్పు గోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్‌ నేటి కార్యక్రమాల వివరాలు.. ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో “మంజీరా పాద నృత్యోత్సవం-7” కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30కి నిడదవోలు పట్టణం లైన్స్ ఆడిటోరియం నందు “మధ్యాంధ్ర శ్రీ రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 5వ భక్తి సమ్మేళనం” కార్యక్రమంలో పాల్గొంటారు. 10:26కొ నిడదవోలు రూరల్ మండలం, కంసాలిపాలెం గ్రామంలో “నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం” కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో NTR కన్వెన్షన్ సెంటర్ నందు “వేలిడిక్టరీ ప్రోగ్రామ్ ఆఫ్ ది సెమినార్ ఆంధ్ర ప్రదేశ్ కల్చరల్ మాగ్నిఫిషియన్స్” కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు పాలింగి రోడ్, తణుకు నందు శ్రీ భమిడి సురన్నగారు లేఔట్ లో “శ్రీ చండి మహా రుద్ర పూర్వక కోటి దీపోత్సవం మరియు కోటి కుంకుమార్చన” కార్యక్రమంలో పాల్గొంటారు.

* శ్రీ సత్యసాయి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన వివరాలు.. చిత్రావతి నది రోడ్డులో ఉన్న బేకరీ షాప్ ఎదురుగా ఉన్న జిల్లా చేనేత శాఖ మరియు APCO ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాల స్టాల్స్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.. బుక్కపట్నం చెరువు వద్ద జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం ఈరోజు ఉదయం 12 గంటలకు ప్రారంభిస్తారు..

* ఖమ్మం: నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి జిల్లాలో పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన లు

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర

* వరంగల్ జిల్లా: నేటి నుండి వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్‌)లో వార్షిక సాంకేతిక వేడుక ‘టెక్నోజియాన్‌’ ప్రారంభం . మూడు రోజుల పాటు జరగనున్న వేడుకలు