* మహిళల వన్డే వరల్డ్ కప్: నేడు బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్.. మధ్యాహ్నం 3 గంటలకు గువాహటి వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ
* తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం.. మధ్యాహ్నం ఎండ ఉంటూనే ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు.. ఉపరితల ఆవర్తనంతో ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రేపు తెలంగాణలోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
* తిరుపతి: నేడు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు.. నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం దంపతులు, మంత్రి లోకేష్.. సీఎం పర్యటన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు
* అమరావతి: ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం.. ఉదయం 11 గంటలకు జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై నేతలకు జగన్ దిశానిర్దేశం
* నేడు తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుల పిటిషన్లపై విచారణ.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు చేపట్టొద్దని గతంలో పిటిషన్లు.. ప్రభుత్వ కౌంటర్ దాఖలుపై నేడు హైకోర్టు విచారణ
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,773 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,100 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు
* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* విజయవాడ: ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్ లో FAPTO పోరుబాట నిరసన ధర్నా.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ధర్నా
* కాకినాడ: నేడు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో వాల్మీకి జయంతి పురస్కరించుకుని పట్టణంలో మహిళలు జ్యోతులతో ర్యాలీ.
* భద్రాద్రి కొత్తగూడెం: నేడు భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం నందు అశ్వయుజ పౌర్ణమి సందర్బంగా రామ లక్ష్మణులకు ప్రసాదాలు అందించిన శబరి జ్ఞాపకార్థం శబరి స్మృతి యాత్ర.. ఈ సందర్బంగా గిరి ప్రధక్షణ, పట్టణంలోని శబరి విగ్రహానికి పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు, స్థానిక గిరిజనుల చేతుల మీదుగా స్వామి వారికి ప్రసాదాలు అందజేత
* విజయవాడ: నేటితో సీనియర్ ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పూర్తి.. ఇవాళ సంజయ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సీఐడీ
* విజయనగరం: నేడు పైడితల్లి సిరిమానోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి..
