NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేటి నుంచి ఆస్ట్రేలియా-భారత్‌ ఏ జట్ల మధ్య రెండో టెస్ట్‌..

* నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..

* తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. హైదరాబాద్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామం వద్ద విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. హాజరుకానున్న బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత.

* ప్రకాశం : నేడు ఒంగోలులో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..

* నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నేషనల్ క్యాన్సర్ డే సందర్బంగా ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారీయా..

* ఒంగోలు లోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ధర్నా…

* రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం గం 11.00 లకు 400/220 KV గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రము మరియు సంబంధిత లైనులు తాళ్లాయపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా నందు ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.

* ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15రోజులు అవకాశం… ఈనెల 20వ తేదీ వరకు ఓటు నమోదుకు గడువు పొడిగింపు

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 10 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చెయ్యనున్న అర్చకులు.. ఈ సందర్భంగా ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.

* ప్రకాశం : కొనకనమిట్ల మండలం సిద్దవరంలో 132/33 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్య అతిథులుగా పాల్గొననున్న మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..

* అనంతపురం : ప్రజాసమస్యల పరిష్కారించాలంటూ రేపటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం.

* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,430 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత

* విశాఖ: నేడు EPDCL ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన… విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్…

* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క