Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన ఘట్టం ప్రారంభం.. ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న బొజ్జ గణపయ్యలు.. బాలాపూర్‌ గణపతికి చివరి పూజ.. ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం.. కాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు

* కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర.. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనం ఏర్పాట్లు.. కొనసాగుతున్న వెల్డింగ్ పనులు..ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతి గా దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. భారీ పోలీస్ బందోబస్తు.. గణేష్ ముందు రోప్ పార్టీ తో భద్రత..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి వద్ద గోదావరి నదిలో భారీగా గణేష్ నిమజ్జనాలు.. పుష్కర్ ఘాట్ పక్కన ఉన్న ఇసుక ర్యాంపులో భారీగా ఏర్పాట్లు.. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలిరానున్న గణనాధుల విగ్రహాలు . రేపు గ్రహణం కారణంగా ఈరోజే అన్ని విగ్రహాలు నిమజ్జనానికి రాక

* అనంతపురం : నేడు తాడిపత్రి వెళ్లనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి కి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు .. సుప్రీంకోర్టు ఆదేశాల తో తాడిపత్రి లో మోహరించిన పోలీసు బలగాలు.. 15 నెలల తర్వాత తాడిపత్రి కి వెళ్తున్న పెద్దా రెడ్డి.

* అన్నమయ్య జిల్లా : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగోతు రమేష్ నాయుడు ఎన్నికైన సందర్భంగా నేడు రాజంపేటలో జరిగే ఆత్మీయ సమా వేశంలో పాల్గొననున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్…  

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,531 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,439 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు

* అనకాపల్లి జిల్లా: నేడు జిల్లాలో పర్యటించనున్న ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర… వర్షాలు కారణంగా బుచ్చయ్యపేట మండలంలో దెబ్బతిన్న వంతెనల మరమ్మత్తుల పనులు ప్రారంభం.

* విశాఖ: నేడు వైసీపీ జోన్ 1 మహిళా విభాగం సమావేశం.. పాల్గొనున్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు

* తిరుమల: చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయం మూసివేత.. రేపు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఎల్లుండి వేకువజాము 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత.. రేపు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. రేపు శ్రీవాణి ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కలిగిన భక్తులకు మధ్యాహ్నం 1:30 గంటలకు దర్శనానికి అనుమతి.. రేపు విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి

* తిరుపతి: చంద్ర గ్రహణం నేపథ్యంలో రేపు పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత…రేపు మద్యాహ్నం 2 గంటల నుండి యల్లుడు తెల్లవారుజామున 4 గంటలకు వరకు ఆలయం మూసివేత… ఆలయ శుద్ది అనంతరం 8వ తేదినా ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి

* హైదరాబాద్‌: కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో వినాయకుడి లడ్డూ వేలంలో రికార్డు.. రూ.2.31 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ

Exit mobile version