Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* విశాఖలో క్రికెట్‌ సందడి… కీలక సమరానికి సిద్ధమైన ఇండియా, సౌతాఫ్రికా జట్లు.. నేడు ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరగనున్న వన్డే మ్యాచ్.. మూడు వన్డేల సీరీస్ మ్యాచ్ లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ… మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.

* విశాఖలో మూడో వన్డే సందర్భంగా కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు… నేడు నగరంలో కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్…

* నల్లగొండ జిల్లా: నేడు దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా పాలన విజయోత్సవ సభల్లో భాగంగా దేవరకొండలో భారీ బహిరంగ సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.

* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం టీటీడీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు

* తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. పెరుగుతున్న చలి తీవ్రత.. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12, చింతపల్లిలో 12.5.. తెలంగాణలోనూ దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు

* నేడు అమెరికాకు మంత్రి నారా లోకేష్‌.. ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు లోకేష్‌ విదేశీ పర్యటన.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్‌ టూర్.. నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికా, కెనడాలో లోకేష్‌ పర్యటన..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్.. ఉదయం 11:30 గంటలకు రాజమండ్రి ప్రకాష్ నగర్ ధర్మాంచర కమ్యూనిటీ హాల్లో తాజా రాజకీయ పరిణామాలపై ప్రెస్‌ మీట్..

* కర్నూలు: నేడు తుగ్గలి( మం) రాతనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ఎమ్మెల్యే కెఈ. శ్యామ్ కుమార్

* తెలంగాణలో మూడో విడతకు ముగిసిన నామినేషన్ల స్వీకరణ.. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉప సంహరణ కు ఈ నెల 9 వరకు గడువు.

* భద్రాద్రి: మాజీ ఎమ్మెల్యే సీపీఐ ఎంఎల్ నేత గుమ్మడి నరసయ్య పై సినిమా కన్నడ నటుడు శివ రాజకుమార్.. నేడు పాల్వంచలోని పెద్దమ్మ గుడిని దర్శించుకోనున్న నటుడు శివ రాజకుమార్

* పల్నాడు జిల్లా: నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం.. సాయంత్రం కొండపై జ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు

* హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖపై ఉదయం 10 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం

* ఇవాళ తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్

* నేడు విశాఖ వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం..

* తిరుమల: 15 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,336 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,063 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు

Exit mobile version