NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌, కమలా హారిస్‌ మధ్య హోరాహోరీ.. స్వింగ్‌ స్టేట్స్‌పై అభ్యర్థుల చివరి ఫోకస్‌

* నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. బోయిన్‌పల్లిలో కులగణనపై సమీక్షించనున్న రాహుల్

* నేడు పల్నాడులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పల్నాడుకు పవన్‌.. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం..

* తిరుమల: ఇవాళ నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో ఉరేగునున్న మలయప్పస్వామి

* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు..

* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉదయం 06:00 గంటలకు రాజమండ్రి నుండి విజయవాడ పయనం.. అమరావతిలో జరిగే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్

* కడప : నేడు జిల్లాకు ఇంఛార్జ్‌ మంత్రి సవిత.. ఇంఛార్జ్‌ మంత్రి హోదాలో మొదటిసారి జిల్లా పర్యటన.. కడప కలెక్టరేట్ లో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో భేటీ అయ్యే అవకాశం.. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న ఇంఛార్జ్‌ మంత్రి..

* కాకినాడ: నేడు జిల్లాకు రానున్న ఇంఛార్జి మంత్రి నారాయణ.. అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనున్న మంత్రి

* అనంతపురం : పోలీసు శిక్షణ కళాశాలలో 2023 బ్యాచ్ కు చెందిన డిఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరు కానున్న హోం శాఖమంత్రి అనిత , డీజీపీ ద్వారకా తిరుమలరావు.

* ఒంగోలు లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గాల ఇంచార్జులు, అన్నీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం..

* ప్రకాశం : ఒంగోలు కార్పొరేషన్ సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరుకానున్న ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్ కుమార్..

* అనంతపురం : జేఎన్టీయూలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సదస్సు.

* అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్లు.. తనపై నెల్లూరులో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని పిటిషన్లు వేసిన కాకాని.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్లు మీద నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. బెయిల్ షరతులు సడలించి విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు వేసిన పిన్నెల్లి

* అమరావతి: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. తుని పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో
ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన దాడిశెట్టి రాజా

* అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలి.. ఏజెన్సీ వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పాడేరులో 16, మినుములురు వద్ద 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు .. దట్టంగా కురుస్తున్న పొగ మంచు…

* ఖమ్మం: నేడు ఖమ్మంలో రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం.. వేలాది మంది గిరిజనులతో సంస్కృతిక సాంప్రదాయాలతో ప్రదర్శన

Show comments