Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరపనున్న చీఫ్ జస్టిస్‌ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్‌.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదన.. రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుల విచారణకు పట్టుబడుతున్న తెలంగాణ ప్రభుత్వం

* ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు ఏపీ సీఎం చంద్రబాబు.. గుంటూరులో జరిగే తెలుగు మహాసభలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

* విజయవాడ: నేడు దుర్గగుడికి మారిషష్ దేశాధ్యక్షుడు ధరంభీర్‌ గోకుల్‌ రాక.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ధరంభీర్‌ గోకుల్

* హైదరాబాద్‌: నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు అధ్యక్షతన భేటీ.. హాజరుకానున్న బీజేపీ ఇంఛార్జ్‌ అభయ్‌ పాటిల్

* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.20 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయల్దేరి మధ్యాహ్నం12.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..

* తిరుమల: శ్రీవారి ఆలయంలో 7వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. టోకెన్ లేకుండా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ..

* అమరావతి: రాయలసీమ లిఫ్ట్ కు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. ఇప్పటికే స్పందించిన ఏపీ ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, వివిధ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఇవాళ.. రేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్.. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు అనపర్తి చేరుకోనున్న జన్మభూమి.. ఈ సందర్భంగా అనపర్తి దేవి చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టనున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

* తిరుమల: ఆరు రోజుల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 4.59 లక్షల మంది భక్తులు.. రేపటి నుంచి స్థానికులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..

* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,179 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 18,831 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు

* అనంతపురం : నేడు బొమ్మనహల్ మండల పరిషత్ అధ్యక్ష స్థానానికి ఎన్నిక. మొత్తం ఎంపీటీసీ సభ్యుల 16 మంది. వైసీపీ ఎంపీటీసీలు 15 మంది.. స్వతంత్ర అభ్యర్థి ఒకరు. కోరం లేకపోయినా ఎంపీపీ పదవి టీడీపీ లాక్కునేందుకు కుట్ర చేస్తోందంటూ ఆరోపిస్తున్న వైసీపీ..

* అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని కాంతి కిరణ్ స్కూల్ టీచర్ గౌసియాపై దాడిని నిరసిస్తూ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు బందుకు పిలుపునిచ్చిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు.

Exit mobile version