Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగతం.. రాజ్ ఘాట్ ను సందర్శించనున్న పుతిన్.. హైదరాబాద్ హౌజ్ లో భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం.. పలు అంశాలపై జరగనున్న ఒప్పందాలు.. భారత మండపంలో జరిగే ఫిక్కీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి హాజరుకానున్న పుతిన్.. రష్యా ప్రభుత్వ చానెల్ ను భారత్ లో ప్రారంభించనున్న పుతిన్.. ఇవాళ రాత్రి రాష్ట్రపతి ఇచ్చే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరించనున్న పుతిన్.. రాత్రి 9 గంటల తర్వాత రష్యా బయల్దేరనున్న పుతిన్..

* ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం.. ఉదయం 10 గంటలకు ముంబై లో మీడియాతో మాట్లాడనున్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. మోనిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడనున్న మల్హోత్రా

* శ్రీకాకుళం: నేడు భామిని మండల కేంద్రంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ మోడల్ స్కూల్ లోని మెగా పేరెంట్స్ సమావేశం & ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

* ఇవాళ వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

* పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూలులో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్.

* అమరావతి: ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 2.45 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..

* కర్నూలు: నేడు గూడూరులో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ బహిరంగ సభ.. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు విడుదల.. జనవరి 2 నుంచి 8 వ తేదీ వరకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల, రోజుకి వెయ్యి చొప్పున 7 వేల టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. రోజుకి 15 వేలు చొప్పున లక్షా 05 వేల టిక్కెట్లు విడుదల

* కాకినాడ: నేడు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అపూర్వ భరత్..

* శ్రీ సత్యసాయి : మడకశిర మండలం భక్తరపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాల్లొ నేడు భూతప్పలు, జ్యోతుల ఉత్సవం.

* అనంతపురం : ఈనెల 11న కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ , రామగిరి ఎంపీపీ ఎన్నిక

* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ ఘటన స్థలం పరిశీలనకు యూనివర్సిటీ విద్యార్థుల నిజనిర్ధారణ బృందం క్షేత్ర పర్యటన.. నిజనిర్ధారణ బృందంలో దేశవ్యాప్తంగా వున్న అనేక యూనివర్సిటీల నుండి విద్యార్థులు పాల్గొనే అవకాశం.

* తిరుమల: 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 51,082 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,836 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు

* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలవనున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మధ్యాహ్నం నల్గొండ నుంచి హెలికాప్టర్‌లో ఏపీ సచివాలయానికి వెంకట్‌రెడ్డి.. రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు నివాసానికి రానున్న తెలంగాణ మంత్రి .. హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు.. చంద్రబాబును ఆహ్వానించనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

* నంద్యాల: నేడు నందికొట్కూరులో బీసీ సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం…

Exit mobile version