* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెల్పనున్న కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం.. పలు సంస్థలకు భూ కేటాయింపులు.. అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం
* నేడు కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎం .. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్న సీఎం.. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జ్ పరిశీలన, బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న సీఎం.. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని సందర్శించనున్న సీఎం
* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డిలో 273 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 500 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
* నేడు బాపట్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ, పాల్గొనున్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
* మెదక్: నేడు చేగుంట, వడియారం, మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. కార్యక్రమంలో పాల్గొననున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
* కాకినాడ: నేటి నుంచి రెండు రోజులు పాటు ఉప్పాడ బీచ్ రోడ్డు లో రాకపోకలు నిలిపివేత.. సముద్రంలో నిమజ్జనం కోసం వినాయక విగ్రహాలు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్ణయం
* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ ను సందర్శించనున్న కేఆర్ఏంబి చైర్మన్ పాండే.. పోతిరెడ్డిపాడు గేట్ల పరిశీలన, దిగువ కు నీటి విడుదల వివరాలను తెలుసుకోనున్న కేఆర్ఏంబి చైర్మన్
* నంద్యాల: నేడు నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా.. కర్నూలు-నందికొట్కూరు మధ్య గ్రామాలలో బస్సులు ఆపడం లేదంటూ ఆందోళన చర్యనున్న విద్యార్థులు .. బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాన్, దామగట్ల, బొల్లవరం విద్యార్థుల ధర్నా..
* నంద్యాల: ప్రథమనందిలో నేడు వైస్సార్ కళ్యాణమండపం వేలంపాట
* జగిత్యాల జిల్లా: ఈ నెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత.. మధ్యాహ్నం స్వామి వార్లకు మహా నివేదన అనంతరం 1 గంటకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేత.. 8 సోమవారం రోజున 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ,గ్రహణ శాంతి, హోమపూజలు.. ఉదయం 9.30 నుండి భక్తుల దర్శనాలకు అనుమతించనున్న ఆలయాధికారులు.
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,472 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,247 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు
* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 1,66,112 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 66,334 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం . తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు . భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
* విజయవాడ: నేటితో ముగియనున్న ఐపీఎస్ సంజయ్ పోలీస్ కస్టడీ.. మూడు రోజులుగా సంజయ్ ను విచారిస్తున్న ACB అధికారులు
