Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ..

* ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన మీటింగ్‌.. హాజరుకానున్న అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు

* అమరావతి: నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రజెంటేషన్‌.. ఈ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ లంచ్ మీట్…..

* అమరావతి: ఇవాళ ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో పాల్గొననున్న పవన్.. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించే అవకాశం… తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్న పవన్..

* భద్రాద్రి కొత్తగూడెం: నేడు బెండలపాడులో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న రేవంత్‌

* నేడు ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకానున్న భట్టి.. వరద నష్టంపై కేంద్ర మంత్రులకు వివరించి సాయం కోరనున్న భట్టి

* తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం.. నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు-వాతావరణ కేంద్రం

* హైదరాబాద్‌: పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం-వాతావరణ కేంద్రం

* విశాఖ: నేడు కార్మికులు, విద్యార్థి సంఘాలు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణా ర్యాలీ.. జగదాంబ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగనున్న ర్యాలీ.. EOI రద్దు, తొలగించిన కాంట్రాక్ట్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతర, రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్లపై నేడు విచారణ

* విజయవాడ: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో చెవిరెడ్డి రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ప నేడు ఏసీబీ కోర్టులో విచారణ

* నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఏలూరు జిల్లా పర్యటన.. ఉదయం  7-30 నిమిషాలకు ఏలూరు బిర్లా భవన్ హోటల్ నందు ” చాయ్ పే చర్చ”, కార్యక్రమం.. 9 గంటలకు ఏలూరు పెద్ద హాస్పటల్ వద్ద   మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం .. అనంతరం పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి  జూట్ మిల్ బ్రిడ్జి వరకు భారీ ర్యాలీ .. క్రాంతి కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డితో నేడు వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఆలూరు నియోజవర్గ శాసనసభ్యులు బి. విరూపాక్షి , డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ములాఖత్

* నేటి నుంచి గుంటూరు మిర్చియార్డులో కార్మికుల‌ సమ్మె.. కొట్టు కాటా, దిగుమతి ముఠా, కాపలా కార్మికుల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్.

* నంద్యాల: నేడు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న కేఆర్ఎంబీ చైర్మన్ బి.పి.పాండే, సభ్యుడు కె.కె.జాన్టిడ్, పలువురు అధికారులు.. చైర్మన్ గా నియమితులైన తర్వాత తొలిసారి శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న బి.పి.పాండే.. కృష్ణాజలాల ప్రవాహం, వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, ప్లంజ్ పూల్ పనులపై ఇరిగేషన్ అధికారులతో చర్చించనున్న చైర్మన్ పాండే.. జలాశయంలో సమస్యలు, లోపాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న పాండే

* భద్రాద్రి: సీఎం రేవంత్‌ రెడ్డి సభతో ట్రాఫిక్ దారి మళ్లింపు.. కొత్తగూడెం నుంచి విజయవాడ రూట్ వెళ్ళే వాహనాలు తల్లాడ మీదుగా తిరువూరు, పెనుబల్లి మీదుగా …. తిరువూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం వెళ్లే వాహనాలు తల్లాడ మీదుగా దారి మళ్లింపు

* నేడు కరీంనగర్ లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న రామచంద్రరావు..

Exit mobile version