Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* బళ్లారి: వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా .. నేడు బళ్లారిలో ఎస్సీ సర్కిల్లో వాల్మీకి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ .. నిన్న జరిగిన పరిణామాలు , కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందడంతో వాయిదా .. కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ కొనసాగింపు

* హైదరాబాద్‌: నేడు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

* హైదరాబాద్‌: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాల వివాదాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..

* హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం ముంబైకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

* హైదరాబాద్‌: నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్‌.. తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ .. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

* హైదరాబాద్‌: ఈరోజు డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న బర్సే దేవా.. హిడ్మా స్థానంలో దేవాను నియమించిన మావోయిస్టు పార్టీ.. ఒకే గ్రామానికి చెందిన హిడ్మా, బర్సే దేవా.. ఆయుధాల సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవాతో పాటు లొంగిపోనున్న 19 మంది ఆపరేషన్‌ సభ్యులు

* నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. ఉదయం 7:45కి మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న పవన్.. 8:35కి గన్నవరం నుంచి బయల్దేరి 9:20కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్.. 9:30కి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టుకు పవన్.. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కొండగట్టులో అధికారిక కార్యక్రమాలు.. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్.. టీటీడీ నిధులతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. శంకుస్థాపన అనంతరం జనసేన తెలంగాణ నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశం

* ప్రకాశం : ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి..ముఖ్య అతిథులుగా హాజరుకానున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, అనగాని సత్యప్రసాద్..

* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ రద్దు చేసిన టీటీడీ

* విశాఖ: నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన… తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం సందర్శించనున్న గవర్నర్.

* శ్రీకాకుళం: డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” నేడు ముగింపు కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు , హోం మంత్రి అనిత, జిల్లా ఇంచార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , పోలీస్ ఉన్నతాధికారులు

* తిరుమల: రికార్డు స్థాయిలో శుక్రవారం భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ.. అదనంగా 15 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,032 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,372 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు

* అంబేడ్కర్ కోనసీమ జిల్లా: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దగ్ధమైన పాత రథం శకలాలు గోదావరిలో నిమజ్జనం.. దేవాదాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లు

* నేటి నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహా సభలు.. మూడు రోజుల పాటు జరగనున్న తెలుగు మహాసభలు.. ప్రపంచ తెలుగు మహా సభలను ప్రారంభించనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహం

* సంగారెడ్డి: నేడు కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఇన్నోవేషన్ డే.. ఐఐటీ విద్యార్ధులు రూపొందించిన అవిష్కరణల ఎగ్జిబిషన్

* భద్రాచలంలో ఇక నుంచి గోదావరి నదిలో ప్రతి వారం నది హారతి.. ఈ రోజు నది హారతి

* నేడు సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమం

* గుంటూరు: నేడు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ.

Exit mobile version