Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతున్న ఉపరితల ఆవర్తనం… ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన.. నేడు విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ.. మిగిలిన కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలకు ఆస్కారం.. వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు-విశాఖ వాతావరణ కేంద్రం

* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు. సీఆర్డీఏ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో సమావేశం.. రాజధాని నిర్మాణాలు.. పలు సంస్ధలకు భూ కేటాయింపులపై చర్చ.

* ఇవాళ విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం అమరావతి నుంచి విశాఖ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ఈస్ట్‌ కోస్ట్‌ మారీటైమ్‌, లాజిస్టిక్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం.. సాయంత్రం తిరిగి అమరావతికి సీఎం చంద్రబాబు..

* నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాటు వద్ద ఉదయం 8 గంటల వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్న మాజీ సీఎం.. అనంతరం పులివెందుల సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించనున్న జగన్.

* కడప : నేడు జిల్లా లో మంత్రి నారా లోకేష్ పర్యటన .. రాత్రి చింతకొమ్మదిన్నె మండలం కొలుముల పల్లె గ్రామంలో బస చేసిన మంత్రి లోకేష్.. నేడు పెండ్లిమర్రి మండలంలో డిగ్రీ కాలేజీని ప్రారంభించనున్న మంత్రి. అనంతరం కొప్పర్తి పారిశ్రామిక వాడలో టెక్స్టైల్ యూనిట్ ని ప్రారంభించునున్న లోకేష్.. జమాల్ పల్లెలో టీడీపీ పార్టీ క్యాడర్ తో సమావేశం.. సాయంత్రం విజయవాడకు బయల్దేరనున్న లోకేష్

* హైదరాబాద్‌: కేసీఆర్‌, హరీష్‌రావు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ.. కాళేశ్వరం కమిషన్‌ నివేదికలో తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లు.. ఇవాళ విచారణ చేపట్టనున్న చీఫ్‌ జస్టిస్‌..

* ఏపీ: నేడు విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమావేశం.. విద్యుత్‌ వినియోగం, సరఫరాపై చర్చించనున్న మంత్రి.. విద్యుత్‌ ప్రమాదాలపై ఎలక్ట్రిసిటీ సేఫ్టీ అధికారులతోనూ చర్చలు

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ..

* అమరావతి : ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న వైసీపీ శ్రేణులు.. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు..

* కడప : రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాటు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల..

* విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను నేడు పోలీస్ కస్టడీకి తీసుకోనున్న అధికారులు.. 3 రోజులపాటు విచారణ చేయనున్న అధికారులు

* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. కౌంటర్లు దాఖలు చేసిన సిట్.. నేడు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు

* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

* తిరుపతి: నేడు ఎస్వీయూ 71వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. శ్రీనివాస ఆడిటోరియంలో సాయంత్రం వేడుకలు.. హాజరుకానున్న జిల్లా ప్రముఖులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డితో ములాఖాత్ కానున్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, మాజీ ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు

* రాజమండ్రి సిటీ రాజానగరాలలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

* బాపట్ల జిల్లా: నేడు రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. స్ర్తీ శక్తి విజయోత్సవ సభలో పాల్గొనున్న మంత్రి అనగాని

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 9 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 2,15,517 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,04,628 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* భద్రాద్రి: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బెండాలపాడు లో రేపు జరగనున్న సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయనున్న మంత్రి పొంగులేటి

* మంచిర్యాల: చెన్నూర్ నియోజకవర్గంలో నేడు మంత్రి వివేక్ పర్యటన. భారీ వర్షాల తో దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్న మంత్రి.

* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,384 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,512 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

Exit mobile version