* నేటి నుంచి భారత్ – వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్.. ఉదయం 9.30కి అహ్మదాబాద్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం
* మైసూర్ ప్యాలెస్‌లో ఘనంగా ఆయుధ పూజలు.. నేడు ప్రతిష్టాత్మకమైన జంబూ సవారీ వేడుకలు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు.. నేడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గమ్మ.. ఉదయం 9.45కు దసరా మహా పూర్ణాహుతి కార్యక్రమం
* హైదరాబాద్: ఉదయం 10.30కు లంగర్ హౌస్ లోని బాపూఘాట్‌లో నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. బాపూ స్మారక భవనాన్ని సందర్శిస్తారు. సర్వమత ప్రార్ధనలు, భజనల్లో పాల్గొంటారు. గవర్నర్ ఈ వేడుకలకు హాజరవుతారు. గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ వేడుకల్లో పాల్గొంటారు.
* నేడు సొంత ఊరికి సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 1.30 కు హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లెకు బయల్దేరివెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరుకానున్న రేవంత్ రెడ్డి.. రాత్రి 10 గంటలకు కొడంగల్ చేరుకుంటారు.
* నేడు భద్రాచలం రామాలయంలో విజయదశమి వేడుకలు.. శ్రీరామ పట్టాభిషేకం దసరా మండపంలో షమీ పూజ రామలీల మహోత్సవం
* ఖమ్మం నగరం లోని జమ్మిబండ వద్ద పారువేట .. దసరా ఉత్సవం
* ఖమ్మం: నేడు మధిరలో దసరా వేడుకల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* ఖమ్మం: నేడు నారాయణ పురంలో దసరా వేడుకల్లో పాల్గొననున్న మంత్రి పొంగులేటి
* అమరావతి : తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో దసరా, గాంధీ జయంతి వేడుకలు.. హాజరుకానున్న పార్టీ ముఖ్య నేతలు..
* విశాఖ: సింహాద్రి అపన్న ఆలయంలో నేడు జమ్మి వేట ఉత్సవం… దసరాను పురస్కరించుకుని కార్యసిద్ధి కోసం శమీ పూజ
* విశాఖ: నేడు ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ.. బీచ్ రోడ్డులో ఖాదీ సంత ప్రారంభించనున్న మంత్రి
* ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకు వస్తున్న తీవ్ర వాయుగుండం
* పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం.. 10 కి.మీ. వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం…. ఒడిశాలోని గోపాల్ పూర్ – పారాదీప్ మధ్య తీవ్ర వాయు గుండం తీరాన్ని దాటే చాన్స్… నేడు, రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు..
* తూర్పుగోదావరి జిల్లా: నేటితో నేత్రపర్వంగా ముగియనున్న ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవి చౌక్ లోని 92వ బాల త్రిపుర సుందరీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఆఖరి రోజు రాజరాజేశ్వరీ దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు.. ఉదయం చక్రస్నానం కార్యక్రమం.. సాయంత్రం 6 గంటలకు బంగారు తిరుచ్చిపై స్వామివారి ఉరేగింపు.. రాత్రి 8 గంటలకు ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,247 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,738 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 2.71 కోట్లు
* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో నేడు దుర్గా,పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గామాత
* కర్నూలు: నేడు హొలగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాలమలేశ్వర స్వామి బన్నీ ఉత్సవం.. 800 మంది పోలీసులతో బందోబస్తు .. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు , 700, ఎల్ఈడి లైట్లు, 10 డ్రోన్ కెమెరాలు, 5 చెక్ పోస్టులు, 10 చెక్ పోస్టులు, వీడియో కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ వల్లెలాంబదేవి
* కాకినాడ: దసరా సందర్భంగా అన్నవరం దేవస్థానంలో నేడు రావణ సంహారం కార్యక్రమం. బాణాసంచా తో తీర్చిదిద్దే రావణబ్రహ్మ సంహారం కార్యక్రమానికి ఏర్పాట్లు
* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరంలో దేవి శరన్నవ రాత్రి వేడుకల్లో నేడు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారి గా భక్తులకు దర్శనం,
* విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతిలో నేడు ఖాదీ సంతలను ప్రారంబించనున్న బీజేపీ.. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడ ఖాదీ సంతను ఉదయం 10గం లకు ప్రారంభిస్తారు.. నాలుగు ప్రాంతాల్లో భారీ గా ఏర్పాటు చేసిన ఖాదీ స్టాల్స్.. హాజరు కానున్న బిజెపి,జనసేన, టిడిపి ఎమ్మెల్యే లు నేతలు
* బాపట్ల: ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ సీ మౌత్ మార్చడాన్నికి నిరసనగా నేడు సమావేశం కానున్న మత్స్యకారులు. రియల్టర్ వెంకట్రావు ఎల్ షేపులో ఉన్న స్ట్రైట్ కట్ ను మార్చడంపై అభ్యంతరం. నేటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్న మత్స్యకారులు
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబైన సాయి కుల్వంత్ సభ మందిరం. వేడుకలను పురస్కరించుకొని ఏడు రోజులుగా కొనసాగుతున్న విశ్వశాంతి కోసం చేపట్టిన వేద పురుష సప్తహా జ్ఞాన యజ్ఞం.
* అంబేద్కర్ కోనసీమ: అమలాపురంలో నేటి రాత్రి దసరా వాహన ఊరేగింపు,… యువకుల చెడి తాలింఖాన ప్రదర్శనలు… భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు…
