* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మైనింగ్ సెక్టార్ పై సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* హైదరాబాద్: నేడు అసెంబ్లీలో ఉపాధి హామీ పథకం పై స్వల్పకాలిక చర్చ.. ఇవాళ సభ ముందుకు మున్సిపల్ సవరణ బిల్లు.. జీహెచ్‌ఎంసీలో మున్సిపాల్టీల విలీనం.. తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు..మోటార్ వెహికల్ టాక్స్ సవరణ బిల్లులు
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇవాళ్టి నుంచి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్న టీటీడీ
* తిరుమల: వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,225 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,106 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు
* తిరుమల: మూడు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 2 లక్షల 2 వేల మంది భక్తులు
* గుంటూరు: నేడు శంకర్ విలాస్ ఆర్‌వోబీ నిర్మాణం పనులు పరిశీలించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శంకర్ విలాస్ ఆర్‌వోబీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణల నేపథ్యంలో పెమ్మసాని పర్యటనకు ప్రాధాన్యత. శంకర్ విలాస్ ఆర్‌వోబీపై వైసీపీ నేతల ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే అవకాశం.
* నాగర్ కర్నూల్, అచ్చంపేట ప్రాంతాల్లో కమ్మేసిన పొగ మంచు.. రాకపోకలకు అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన దారులు
* బాపట్ల జిల్లా: నేడు కొల్లూరు మండలం దోనేపూడిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన. రైతులకు పాసు పుస్తకాలు అందించనున్న మంత్రి అనగాని.
* రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న పవన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్..
* హైదరాబాద్: రేపు కృష్ణా నది జల వివాదంపై అసెంబ్లీలో చర్చ
* పార్వతిపురం మన్యం జిల్లా: సాలూరు మండలం శివరాంపురం పంచాయతీ కేంద్రంలో పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా
