Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు ఢిల్లీలో ఏఐసీసీ న్యాయ సదస్సు.. విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న సదస్సు.. రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు థీమ్ పై సదస్సు.. ప్రసంగించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లీగల్ సెల్ సదస్సులో ప్రసంగించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సదస్సుకు హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు, లీగల్ సెల్ సదస్సులో మొత్తం 41 ప్రసంగాలు

* నేడు ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు పర్యటన.. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

* నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద, ఇన్ ఫ్లో 2 లక్షల 38 వేల 629 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2 లక్షల 56 వేల 417 క్యూసెక్కులు.. 24 క్రస్ట్ గేట్‌లు 5 ఫీట్లు, 2 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల.. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.

* మంచిర్యాల: జిల్లా లో నేడు మంత్రి వివేక్ పర్యటన. మందమర్రిలో మొక్కలు నాటుదాం పర్యావరణం కాపాడదాం కార్యక్రమం పాల్గొంటారు.. రామకృష్ణాపూర్ కాకతీయ కాలనీ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల రీ ప్రారంభోత్సవం చేయనున్నారు, రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

* నేడు సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు కొనసాగనున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అనంతరం కార్యకర్తలతో సమావేశం కానున్న మీనాక్షి నటరాజన్

* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు

* సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద.. ఇన్ ఫ్లో 1968 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 633 క్యూసెక్కులు..

* నిజమాబాద్ : నేడు జిల్లాకు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు బై పాస్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర. ఆర్మూర్ పట్టణంలో కొనసాగనున్న పాదయాత్ర.. పాల్గొననున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క., ఎం ఎల్. ఏ. లు

* నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్న అన్నదాత సుఖీభవ డబ్బులు.. మొత్తం కలిపి మొదటి విడతల్లో. 7,000 రూపాయలు.. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ యోజన కింద .2,000 రూపాయలు .. రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం క్రింద. 5,000

* నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు ములాఖాత్ కు వెళ్ళుతున్న వైసీపీ నాయకులు.. ఉదయం 10:30 గంటలకు ములాఖాత్‌కు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు

* తిరుమల: ఎల్లుండి శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

* విజయనగరం: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు అన్నదాత-సుఖీభవ కార్యక్రమం.. పాల్గొనున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

* కర్నూలు: నేడు కోడుమూరులో సిపిఎం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల రిలే దీక్షలు.. జీతాలు పెంచాలని డిమాండ్

* శ్రీ సత్యసాయి : నేడు సోమందేపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేసిన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత.

* శ్రీ సత్యసాయి : కనగానపల్లి మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత…

* అన్నమయ్య జిల్లా : నేడు చిన్నమండెంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి…

* గుంటూరు: నేడు లాం కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ రైతులకు నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Exit mobile version