Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై నేడు రాజ్యసభలో చర్చ.. కాంగ్రెస్‌ తరఫున చర్చ ప్రారంభించనున్న మల్లికార్జున ఖర్గే.. రాజ్యసభ చర్చలో కాంగ్రెస్‌కు 2 గంటలు కేటాయింపు

* నేడు ఏపీ కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాలు విడుదల.. 2022 అక్టోబర్‌లో జరిగిన కానిస్టేబుల్‌ పరీక్షలు.. పలు న్యాయ వివాదాల తర్వాత నేడు ఫలితాలు

* ఇవాళ ఉదయం 9 గంటలకు తెరుచుకోనున్న నాగార్జునసాగర్‌ క్రస్ట్ గేట్లు.. నాగార్జునసాగర్‌ గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేయనున్న మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, అడ్లూరి

* సింగపూర్ పర్యటనలో మూడో రోజు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి.. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు.. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

* అమరావతి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం కానున్న జగన్.. రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్దాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న జగన్‌..

* బాపట్ల : కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని బాల, బాలికలకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్..

* నంద్యాల: నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం..

* మహానంది క్షేత్రంలో శ్రావణమాసం మంగళవారం సందర్భంగా నేడు చండీయాగం , కుంకుమార్చనలు

* కర్నూలు: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కర్నూలు పర్యటన.. ఉదయం 07:30 ని।।ల నుండి 8:00 వరకు క్లబ్ క్యాంటీన్ దగ్గర ఛాయ్ పే చర్చ .. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న మాధవ్.. బీజేపీ శ్రేణులతో మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ర్యాలీ

* కాకినాడ: ఢిల్లీ వెళ్లిన కలెక్టర్ షాన్ మోహన్.. కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్న కలెక్టర్.. ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు పై ప్రజెంటేషన్ ఇవ్వనున్న షాన్ మోహన్.. 323 కోట్లతో కోత నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

* అనంతపురం : నేడు సెంట్రల్ యూనివర్సిటీ భవన సముదాయాలను వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మొదటి విడతగా విడుదల చేసిన రూ.350 కోట్లతో చేపట్టిన భవనాలు.

* శ్రీ సత్యసాయి : నేడు రొద్దం మండలం కళ్లికుంట గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.

* నేడు విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలపై సమన్వయ సమావేశం.. హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ల‌క్ష్మీశ‌, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు .. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, ట్రాఫిక్, క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర అంశాల పై సమీక్ష.. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు

* తిరుమల: ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* విజయవాడ: మైలవరంలో నేడు హోమ్ మంత్రి అనిత పర్యటన.. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొననున్న అనిత

* కర్నూలు: సుంకేసుల జలాశయంకు భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు.. ఔట్‌ ఫ్లో 1,03,437 క్యూసెక్కులు.. 21 గేట్ల ఎత్తివేత

* బాపట్ల జిల్లా: నేడు బాపట్లలో సీఎస్ విజయానంద్ పర్యటన, కలెక్టరేట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షలో‌ పాల్గొనున్న సీఎస్

* హైదరాబాద్‌: నేటి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీలో స్పెషల్‌ మాన్సూన్‌ డ్రైవ్.. వార్డుల వారీగా వ్యర్థాల తొలగింపు చేపట్టనున్న బల్దియా.. ప్రతి రోజు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్పెషల్‌ డ్రైవ్

* మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలెర్ట్.. నేటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో రాకపోకలపై నిఘా

* నేడు తేరచుకోనున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు.. దిగువకు నీటిని విడుదల చేయనున్న ఇన్ ఛార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 14 గేట్ల వరకు తెరిచే అవకాశం.

* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్

* మెదక్: నేడు నర్సాపూర్ (మం) నాగులపల్లి ట్రైబల్ గర్ల్స్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. వర్చవల్ గా శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

* నేడు మెదక్ జిల్లాలో RTI కమిషనర్ల పర్యటన.. జిల్లా కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టంపై వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్న కమిషనర్లు

* మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,34,116 వేల క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో 1,35,910 వేల, క్యూ సెక్కులు.. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.

Exit mobile version