Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు జపాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సెమీ కండక్టర్లతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్న మోడీ

* నేడు ఉదయం 8.30 గంటల వరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ఐఎండీ.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు-ఐఎండీ

* ఇవాళ విశాఖ లో సీఎం చంద్రబాబు పర్యటన.. నోవాటెల్ లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం… రాడిషన్ బ్లూ హోటల్ లో గ్రీఫిన్ ఫౌండర్ నెటవర్క్స్ మీటింగ్ కూ హాజరు.. సాయంత్రం విశాఖ నుండి కుప్పం వెళ్ళనున్న చంద్రబాబు… రేపు కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పైన పైలాన్ ను ఆవిష్కరించనున్న చంద్రబాబు..

* అమరావతి : ఇవాళ చెన్నై నుంచి తిరిగి బెంగుళూరుకు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. నిన్న జగన్ సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం కోసం చెన్నై వెళ్లిన జగన్.. ఇవాళ ఉదయం కుటుంబ కార్యక్రమానికి హాజరైన అనంతరం బెంగుళూరుకు బయలుదేరనున్న జగన్..

* విశాఖలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన.. వైజాగ్ కన్వెన్షన్ లో జరిగే అర్థసమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్ కు ముఖ్య అతిథిగా లోకేష్.. చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో ఏఐ ల్యాబ్స్ ప్రారంభం. ఎయిరోస్పేస్ మానుఫ్యాక్చరింగ్ పై సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్న మంత్రి. ఆంధ్రయూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనున్న లోకేష్.. సాయంత్రం భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ

* నేడు తిరుపతిలో దక్షిణ ప్రాంత ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశం.. ప్రధానమంత్రి ఆదేశాలతో సమావేశం కానున్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షదీవులు, అండ మాన్ నికోబార్ దీవులకు చెందిన డీజీపీ, అదనపు డీజీపీలు..

* నంద్యాల: మహానంది క్షేత్రంలో శుక్రవారం సందర్భంగా నేడు కామేశ్వరి దేవి అమ్మవారి కుంకుమార్చనలు, పల్లకి సేవ

* కర్నూలు: నేడు కోడుమూరులో వినాయక నిమజ్జనం

* కర్నూలు: నేడు ఆలూరు నియోజకవర్గంలో వినాయక నిమజ్జనం… హాలహర్వి ఎల్ ఎల్ సి కాలువ ఘాట్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు….

* శ్రీ సత్యసాయి : నేటితో ముగియనున్న ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ పోలీస్ కస్టడీ. నిన్న సుదీర్ఘంగా విచారించిన పోలీస్ అధికారులు.

* తూర్పుగోదావరి జిల్లా: లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న వైసీపీ నేతలు మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ , గూడూరి శ్రీనివాస్

* పల్నాడు జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు‌ కొనసాగుతున్న వరదప్రవాహం. ఆరు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లూ 2లక్షల 28వేల 850 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 2లక్షల 10వేల 474 క్యూసెక్కులు.

* ఏలూరు: నేటి నుంచి 3 రోజుల పాటు పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన.. డయాఫ్రం వాల్ నిర్మాణం, ఇతర పనులను పరిశీలించనున్న బృందం. పోలవరం ఐదోసారి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న నిపుణుల బృందం..

* విశాఖ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడు అరెస్ట్ .. బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను అరెస్టు చేసిన ఎన్ఐఏ .. నేడు విశాఖపట్నం NIA కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ ను హాజరుపరచనున్న NIA

* నేడు ఢిల్లీకి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌కి హాజరుకానున్న డిప్యూటీ సీఎం

* ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నేడు ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ.. మిథున్‌రెడ్డి మధ్యంతర, రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టలో విచారణ

* భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ.. ఆగస్టు లో సాధారణ వర్షపాతం కంటే 135 శాతం అధికంగా కురిసిన వర్షం. రాజంపేట, భిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగం పేట, కామారెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ, నిజాం సాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివ నగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, మహమ్మద్ నగర్, గాంధారి లో రెండు రోజుల్లో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షం

* శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద.. 39 వరద గేట్లు ఎత్తివేత, ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5 లక్షల 30వేల క్యూసెక్కులు

* భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి వరద.. 35 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం

* ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

* నిర్మల్: జిల్లా లో ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. కడెం ప్రాజెక్టు రెండు, స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.

* యాదాద్రి జిల్లా: స్వాతి నక్షత్రం పురస్కరించుకొని యాదగిరిగుట్ట స్వామివారికి వైభవంగా అష్టోత్తర శతకటాభిషేకం.. గిరి ప్రదిక్షణలో పాల్గొన్న వేలాది మంది భక్తులు

* మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు అన్ని విద్యాసంస్థలకు సెలవు..

* సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల.. రెండు జెన్ కో గేట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అధికారులు.. ఇన్ ఫ్లో- 54200, ఔట్ ఫ్లో- 43286 క్యూసెక్కులు

* నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు భారీ గా వరద. 39 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 4 లక్షల 30 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5 లక్షల 30 వేల క్యూసెక్కులు.

* వనపర్తి జిల్లా: సరళ సాగర్ ప్రాజెక్ట్ కు వరద. తెరుచుకున్న 3 ఆటోమేటిక్ సైఫన్లు. ఔట్ ఫ్లో 5000 వేల క్యూ సెక్కులు.

* మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు పోటెత్తుతున్న వరద.. 27 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, ఇన్ ఫ్లో 1,98,000 క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో 2,33,709 క్యూసెక్కులు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Exit mobile version