Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న మొంథా.. రెడ్‌ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తుఫాన్‌ ప్రభావంతో అంతకంతకు పెరుగుతున్న గాలుల తీవ్రత.. గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు చేరనున్న ఈదురుగాలుల తీవ్రత.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్‌ ముప్పు.. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం

* తెలంగాణపై మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్.. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. గంటలకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

* తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన వర్షం.. నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు

* ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ.. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కి.మీ.. కాకినాడకు 310 కి.మీ.. విశాఖకు 370 కి.మీ. దూరంలో మొంథా తుఫాన్‌ కేంద్రీకృతం.. ఇవాళ రాత్రికి ఒంగోలు, బందరు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం

* అమరావతి: ఉదయం. 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. తుఫాన్ పరిస్థితి పై ప్రత్యేక సమీక్ష.. మధ్యాహ్నం కొత్త జిల్లాలపై కేబినెట్‌ సబ్ కమిటీ తో సీఎం చంద్రబాబు సమావేశం

* నేటి నుంచి NTR వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రుల సేవలు నిలిపివేత.. ఇప్పటికే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 650 ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలు నిలిపివేత. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత..

* తూర్పుగోదావరి జిల్లా: తుఫాను పరిస్థితిపై అప్రమత్తంగా ఉన్న జిల్లా యంత్రాంగం.. జిల్లాలో సగటు వర్షపాతం 8.00 మిల్లీమీటర్లుగా నమోదు, ఇప్పటి వరకు 105 గ్రామాల్లో 325.09 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురి.. బిక్కవోలు, రంగంపేట మండలాల్లో నాలుగు ఇళ్లకు స్వల్ప నష్టం.. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఎటువంటి అంతరాయం లేదు,

* తీవ్ర తుఫాన్ ఐ వాల్ ఆధారంగా ప్రభావిత ప్రాంతాలను అంచనా వేస్తున్న ఐఎండీ.. కాకినాడకు దక్షిణంగా తీరం దాటే అవకాశం.. విశాఖలో అతిభారీ వర్షం.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొదలైన వర్షం.. పెరిగిన చలి తీవ్రత .. నేడు, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు

* మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు.. రాత్రి నుండి తిరుపతి, కాళహస్తి, సత్యవేడు,చంద్రగిరి లో మోస్తరుగా కురుస్తున్న వర్షం.. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అలెర్ట్ గా ఉన్న జిల్లా అధికార యంత్రాంగం.. కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు.

* మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ ఎలర్ట్, పల్నాడు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. నేడు, రేపు మిర్చియార్డుకు సెలవులు ప్రకటించిన అధికారులు.. నేడు, రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవులు.

* నెల్లూరు: తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న మోస్తారు వర్షాలు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున 4 గంటల దాకా తోటపల్లి గూడూరులో అత్యధికంగా 16.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు.. ఇవాళ కూడా రోజంతా వర్షాలు పడే అవకాశం ఉండటంతో స్కూల్స్, కాలేజెస్ కి సెలవు ప్రకటించిన కలెక్టర్

* అనంతపురం : ఇవాళ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఎస్సీ శాసనసభ కమిటీ. దళిత సంఘాలతో వినతి పత్రాలు స్వీకరించ నున్న కమిటీ సభ్యులు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం.

* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. వైకుంఠ ద్వార దర్శనంపై చర్చించనున్న పాలకమండలి

* తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు.. ఈస్ట్‌కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దు.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లుద్దు చేసిన రైల్వే అధికారులు.. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు.. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్‌కు నడిచే పలు రైళ్లను రద్దు చేసిన సౌత్‌ సెంట్రల్ రైల్వే

* మొంథా తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన విజయవాడ అధికారులు.. ఈ రోజు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచన.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలి.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చన్న అధికారులు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలి.. వాకింగ్ కి వెళ్లొద్దని సూచన.. ఎన్టీఆర్ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్: 9154970454, వీఎంసీ కంట్రోల్ రూమ్‌: 0866 2424172, 0866 2422515, 0866 2427485 ఏర్పాటు

* విజయవాడ: మొంథా తుఫాన్‌ దృష్ట్యా పలు విమానాలు రద్దు.. ఇవాళ ఎయిర్‌ ఇండియాకి చెందిన విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ప్రకటన

* హైదరాబాద్‌: నేడు యూసుఫ్‌గూడలో సీఎం రేవంత్‌ రెడ్డి సభ.. సినీ కార్మికులతో సభ

* ఖమ్మం: నేడు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యుత్ సబ్ స్టేషన్ లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ లకు శంకుస్థానాలు

* నేడు భూపాలపల్లి లో రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన.

* మహబూబ్ నగర్: నేడు శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అయిన ఉద్దాల మహోత్సవం. పెద్ద ఎత్తున తరలి రానున్న భక్తులు

Exit mobile version