* నేడు థాయ్‌లాండ్ – కంబోడియా కాల్పుల విరమణ చర్చలు.. నాలుగు రోజులుగా థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు ఘర్షణలు
* ఢిల్లీ: నేడు పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ.. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు కొనసాగనున్న చర్చ.. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న చర్చ.. లోక్‌సభలో చర్చను ప్రారంభించనున్న రాజ్‌నాథ్ సింగ్..
* బీహార్ ఓటర్ల జాబితాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. వివాదాస్పదంగా మారిన బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణపై విచారణ.. ఎన్నికల ముంగిట ఈసీ చేపట్టిన సవరణను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు
* హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ఛాన్స్.. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి అందిన కమిషన్ నివేదిక.. మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం..
* ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా… పలు సంస్థల అధిపతులతో సమావేశం.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చ..
* ఇవాళ హైదరాబాద్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న మీనాక్షి
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
* అమరావతి : రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం.. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీలో చర్చించనున్న నేతలు.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి..
* విశాఖ: నేడు కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమీక్ష.. PGRSలో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి…
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతి.. ధవళేశ్వరం. బ్యారేజ్ వద్ద 10. 90 అడుగులకు చేరిన వరద నీటిమట్టం. మ్యారేజ్ నుండి 6 లక్షల 20 వేల క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు విడుదల.. బ్యారేజ్ కి సంబంధించిన 175 గేట్లు ఎత్తివేత
* రాజమండ్రి: నేడు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సౌకర్యాలపై కౌంటర్ దాఖలు చేయనున్న న్యాయవాదులు.. జైలు సూపరింటెండెంట్ వేసిన రివ్యూ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఆదేశాలు మేరకు కౌంటర్ దాఖలు చేయనున్న మిధున్ రెడ్డి తరుఫున న్యాయవాదులు
* రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ ఉదయం గం. 10.45 గంటలకు కుటుంబ సభ్యులు ములాఖాత్
* నేడు కాకినాడ వైసీపీ ఎస్సీ సెల్ విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న వైసీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు
* తిరుమల: రేపు గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* విశాఖ: నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు… మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఈ ఏడాది తీవ్ర నష్టం.. పార్టీ అగ్రనాయకత్వం సహా వందల మంది ఎన్కౌంటర్ లలో మృతి.. అమరవీరుల వారోత్సవాల విజయవంతం కోసం మావోల వ్యూహాలు.. ఏటా జూలై 28నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోలు.. AOBని జల్లెడ పడుతున్న బలగాలు….
* నంద్యాలలో నేడు, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన.. నేడు నంద్యాలలో వార్డులో స్టానికులతో చాయ్ పే చర్చ.. బీజేపీ శోభాయాత్ర, కార్యకర్తలతో సమావేశం, స్థానిక ప్రముఖులు, మేధావులు పారిశ్రామికవేత్తలతో చర్చ
* కొమురం భీం జిల్లా: నేడు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు ఆదివాసి సంఘాల పిలుపు.. జీవో నంబర్ 49ని రద్దు చేయాలని డిమాండ్ తో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేయనున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి.. ఇప్పటికే జీవో నంబర్ 49 ని నిలుపుదల చేసిన ప్రభుత్వం.
* మెదక్: పాపన్నపేట (మం) రామతీర్థం గ్రామ శివారు మంజీరా నదిలో గల్లంతైన యువకుడి కోసం ఈ రోజు ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్న అధికారులు
* నిజామాబాద్ : శ్రీరాం సాగర్ కు భారీగా వరద.. ఇన్ ఫ్లో 68, 516 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 1072 అడుగులు
* నిజామాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన.. జిల్లా కేంద్రంలో జరిగే వన మహోత్సవం తో పాటు వివిధ ఆలయాల పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొననున్న నేతలు..
* రాజన్న సిరిసిల్ల జిల్లా: మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించిన ఆలయ అర్చకులు.. తెల్లవారుజామునుండే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తులు.. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం, ఆర్జిత సేవల రద్దుచేసి భక్తులకు లఘు దర్శనానికి అనుమతి
* నేడు సంగారెడ్డి నియోజకవర్గంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హరీష్ రావు ప్రెస్ మీట్
* మెదక్ఐ నేడు నర్సాపూర్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు
* నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటన.. పెన్షన్ల పెంపు ధర్నాపై సన్నాహక సమావేశంలో పాల్గొననున్న మందకృష్ణ
