Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ

* తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, కొమురంభీం, నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

* తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. నేడు ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించనున్న సీఎం రేవంత్‌ రెడ్డ

* ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రోజు మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రాహుల్ రాజ్

* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో 32.33 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.. భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్లు

* నిజమాబాద్ : కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ .. భారీ వర్షాల కారణంగా కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా నేడు విద్యా సంస్థలకు సెలవు

* ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు.. అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

* అమరావతి: ఇవాళ ఉదయం 11.30 కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం, ఏపీలో పెట్టుబడులు.. కొత్త పరిశ్రమలపై చర్చ.. కొన్ని ముఖ్య శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం.. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించే అవకాశం..

* హైదరాబాద్‌: మధ్యాహ్నం 12.30 కి ఉద్యోగుల సమస్యలపై వేసిన అధికారుల కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు వాటర్ వర్క్స్ అధికారులతో భేటీ

* విశాఖ : సేనతో – సేనాని కార్యక్రమానికి సిద్దమైన విశాఖ.. నేటి నుంచి మూడు రోజులపాటు జనసేన విస్తృతస్తాయి సమావేశాలు.. సేనతో – సేనాని పేరుతో విశాఖ వేదికగా వరుస సమావేశాలు..

* విశాఖ: బే వ్యూ హోటల్ లో ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ లెజిస్లెటివ్ సమావేశం.. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ ఎక్సక్యూటివ్ మీటింగ్.. 29న పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం.. 30న బహిరంగ సభ.. ఏపీ, తెలంగాణ నుంచి తరలి రానున్న 15 వేల మంది ఆహ్వానితులు..

* తూర్పు గోదావరి జిల్లాలో నేడు తక్కువ స్థాయి నుంచి మోస్తారు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపిన విపత్తుల నిర్వహణ సంస్థ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి తో ములాఖాత్ కానున్న మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ , స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు

* తిరుమల: సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి తరువాత రోజు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత.. 7వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. గ్రహణం కారణంగా 12 గంటల పాటు దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,185 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,098 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు

* పల్నాడు జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు‌ పెరిగిన వరదప్రవాహం… 11 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 3.67 లక్షల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 3.74 లక్షల క్యూసెక్కులు.

* నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.

* నేడు గుంటూరులో బషీరాబాగ్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొనున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

* కామారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్టు కు పోటెత్తిన వరద .. 24 గేట్ల ఎత్తివేత.. ఇన్ ఫ్లో 2 లక్షల 33వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,95 వేల క్యూసెక్కులు

* నిర్మల్: కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 31,116 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 42,171 క్యూసెక్కులు.

* నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద, 39 గేట్లు ఎత్తిన అధికారులు.. ఇన్ ఫ్లో 3 లక్షల 40 వేల క్యూసెక్కులు, 39 గేట్ల ద్వారా నీటి విడుదల

* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. 10 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,88,665 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,32,257 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 69 గేట్లను 6 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. బ్యారేజి నీటిమట్టం 12 అడుగులు.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,03,354 క్యూసెక్కులు

* భద్రాద్రి. జిల్లా వ్యాపితంగా కురుస్తున్న వర్షాల వల్ల సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి బొగ్గు గలల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Exit mobile version