Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముడోవ రోజు.. ఉదయం 8 గంటలకు నరశింహ అవతారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు శ్రీకృష్ణుని అవతారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* విజయవాడ ఇంద్రకీలాద్రి పై నేడు ఐదవ రోజు దసరా ఉత్సవాలు.. శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు

* హైదరాబాద్‌: తెలంగాణలో 2,620 మద్యం షాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌.. నేటి నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తుల ప్రక్రియ.. అక్టోబర్‌ 23న కొత్త దుకాణాల కేటాయింపునకు డ్రా ప్రక్రియ.. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు డ్రా పద్ధతిలో మద్యం షాపుల కే టాయింపు

* అమరావతి: ఇవాళ ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం

* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* అమరావతి : ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఏడవ రోజు శాసనమండలి సమావేశాలు…

* విజయవాడ: నేటితో ముగియనున్న లిక్కర్ కేసు నిందితుల రిమాండ్.. 8 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు

* అమరావతి: హైకోర్టులో లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు.. కేసులో ఏ7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* అమరావతి: లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న సిట్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ పిటిషన్

* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో 5వ రోజు వైభవంగా బాలత్రిపుర సుందరీ దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* నెల్లూరు: జొన్నవాడలో ఐదవ రోజుకు చేరిన దేవీ నవరాత్రులు.. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న కామాక్షితాయి అమ్మవారు.

* తిరుమల: 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,388 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,998 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.1.74 కోట్లు

* అనంతపురం : తాడిపత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న శ్రీ శక్తి పథకం పై డిపోను తనిఖీ చేయనున్న ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమల రావు.

* శ్రీ సత్యసాయి : హిందూపురం నేడు ఎంజీఎం పాఠశాల ఆవరణలో మెగా వైద్య శిబిరం. మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలు

* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో నేడు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గా దేవి

* పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం… రేపు ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం… దక్షిణ కోస్తాకు భారీ నుంచి అతిభారీ వర్షం హెచ్చరికలు.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం… మత్స్యకారులు వేటను నిషేధించిన అధికారులు

* గుంటూరు: నేడు కలెక్టరేట్ లో గుంటూరులో డయేరియా, కలరా వ్యాప్తిపై సమీక్షా సమావేశం, పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అధికారులు

* తిరుపతి: రేపటి నుండి శిల్ప రామం లో దసరా ఉత్సవాలు…

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అయిన నేడు ధనలక్ష్మి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

* వరంగల్: శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలలో భాగంగా నేడు 5వ రోజు ఉదయం 4 గంటలకు ” నిత్యాహ్నికం, లలితా పంచమి శ్రీ రాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరిఅలంకారము, చతు:స్థానార్చన. స్కందమాత దుర్ఘర్చన…, ఉదయం 11 గంటలకు “పల్లకీ సేవ.. సాయంత్రం 7 గం” దూమ్రహాదుర్గార్చనా,శేషవాహన సేవ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు..

* నేడు సంగారెడ్డిలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పర్యటన..

* నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో 5 వ రోజు కు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు… నేడు స్కంద మాతా గా భక్తులకు దర్శనం. పెరుగు అన్నం నివేదన.

* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి కూష్మాండ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు.

Exit mobile version