Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు.. కుటుంబ సభ్యులతో సహా హాజరుకానున్న డీఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు

* ఈ నెల 30 వరకు తెలంగాణకు భారీ వర్ష సూచన.. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం..

* ఇవాళ ఢిల్లీలో డీసీసీ పరిశీలకుల నియామక ప్రక్రియలపై దిశానిర్దేశం.. తెలంగాణ డీసీసీ నియామకాల కోసం 22 మంది పరిశీలకులను నియమించిన ఏఐసీసీ.. అక్టోబర్‌ 4 నుంచి 10 రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి.. డీసీసీ అధ్యక్షుల నియామకాలకు అభ్యర్థులను సిఫార్సు చేయనున్న పరిశీలకులు

* అమరావతి: ఇవాళ ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం.. నౌకా నిర్మాణ పరిశ్రమలు.. రాష్ట్రంలో పెన్షన్లు.. కోవూరు నియోజక వర్గంలో కాలువల పై వంతెనలు.. నిరుద్యోగ భృతి.. దర్జీలకు ఉపాధి అవకాశాలు.. అటవీ భూముల నుంచి కావలి అటవీ గ్రామాలను డీ రిజర్వ్ చెయ్యడంపై సభ్యుల ప్రశ్నలు.. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై స్వల్పకాలిక చర్చ

* అమరావతి : ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఆరవ రోజు శాసనమండలి సమావేశాలు…

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి రానున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో రాజమండ్రి సెంటర్ జైల్లో ములాఖాత్ కానున్న పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు ములాఖాత్ కు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, మెరుగు నాగార్జున

* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో 4వ రోజు ఘనంగా బాలత్రిపుర సుందరీ దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు

* విజయవాడ: లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.. కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి

* తిరుమల: 7 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,628 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,551 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నాల్గో రోజు వైభవంగా దసరా ఉత్సవాలు.. నేడు కాత్యాయని దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం..

* తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

* నేడు తిరుపతిలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటన.. మధ్యాహ్నం12.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొనున్న ఉపరాష్ట్రపతి

* వరంగల్: శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలలో భాగంగా నేడు 4వ రోజు నిత్యాహ్నికం, శ్రీమహాలక్ష్మి అలంకారము, చతు:స్థానార్చన. కుష్మాండి దుర్ఘర్చన ఘంటా దుర్ఘర్చన. ఉదయం 11 గంటలకు సూర్యప్రభవాహన సేవ.. సాయంత్రం 7 గంటలకు గిరిజాదుర్గార్చనా, హంసవాహన సేవ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు..

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు 4వ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి కూష్మాండ దుర్గ , మూల మూర్తికి రాజరాజేశ్వరి అలంకరణ

* కర్నూలు: నేడు గూడూరు (మం) కె.నాగులాపురంలో కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న సుంకులాపరమేశ్వరి

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 10 గేట్లు 12 అడుగుల ఎత్తివేత.. ఇన్ ఫ్లో 2,73,958 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,71,451 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Exit mobile version