NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు, రేపు తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన.. నేడు మెదక్‌ జిల్లా తునికిలోని ICAR-కృషి విజ్ఞాన కేంద్రంలో సహజ, సేంద్రీయ రైతుల సదస్సుకు హాజరుకానున్న ధన్కర్‌, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ..

* నేడు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో మధ్యాహ్నం 12.30కి సమావేశం.. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించనున్న నేతలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణ.. జమిలి బిల్లు, ఈసీ తీసుకొచ్చిన సంస్కరణలపైనా చర్చించే అవకాశం

* ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు.. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు.. సాయంత్రం 5 గంటలకు ప్రధానితో భేటీకానున్న చంద్రబాబు

* నేడు మెదక్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న రేవంత్.. మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న సీఎం రేవంత్‌ రెడ్డి

* కడప: పులివెందులలో వైఎస్‌ జగన్‌ .. నేడు CSI చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్న జగన్..

* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న హరీష్ రావు

* నేడు మెదక్ క్యాథెడ్రిల్ చర్చికి రానున్న BRS ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న కవిత

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. రేపు మధ్యాహ్నం వసతి గదులు కోటా విడుదల.. ఎల్లుండి శ్రీవారి సేవా కోటా విడుదల చేయనున్న టీటీడీ..

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు.

* ప్రకాశం : ఒంగోలు జేఎంబీ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..

* కడప : పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్యాహ్నం నుంచి పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం కానున్న మాజీ సీఎం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ .. నెల్లూరులో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు

* మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహం నేడు విజయవాడలో ఆవిష్కరణ.. విగ్రహ ఆవిష్కరణ చేయనున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి

* శ్రీ సత్యసాయి : విజయవాడ పర్యటనలో మంత్రి సవిత.

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురంలో పర్యటన.. అమలాపురంలో మెట్ల సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి: నేడు గోకవరంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరిక.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి సమక్షంలో చేరిక

* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు.. ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్టణం సంత మార్కెట్ సెంటర్ లో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. అనంతరం నిడదవోలు నియోజకవర్గంలోని పలు చర్చల్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్

* నెల్లూరు లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.

అన్నమయ్య జిల్లా : నేటి నుండి మూడు రోజులు పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

* తిరుమల: 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,209 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,708 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు

Show comments