Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ..

* దుబాయిలో మూడవ రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు.. తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. దుబాయ్ లీమెరిడియన్ హోటల్ లో సాయంత్రం 6.30 గంటలకు తెలుగు ప్రజలతో ఎపి ఎన్ఆర్టి నేతృత్వంలో సమావేశం

* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..

* నేడు చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో తుది తీర్పు.. నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతుల హత్య.. పదేళ్ల తరువాత వెలువడనున్న తీర్పు.. అంతటా ఉత్కంఠ

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో ఉదయం 10 గంటలకు జనవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల,తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల

* తిరుమల: రేపు నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహన ఊరేగింపు.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,896 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,077 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు

* అనకాపల్లి జిల్లా: నేడు రాజయ్య పేటలో పర్యటించనున్న కలెక్టర్ విజయ కృష్ణన్… గ్రామస్థులతో సమావేశం.. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళనలు నేపథ్యంలో కలెక్టర్ టూర్ పై ఆసక్తి…

* నేడు సిద్దిపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.. గౌరారం కావేరి సీడ్స్ కంపెనీలో ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్న జిష్ణుదేవ్ వర్మ

* నిజమాబాద్ : నేడు జిల్లాలో పర్యటించనున్న రైల్వే డివిజనల్ మేనేజర్.. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్న డి. ఆర్. ఎం సంతోష్ కుమార్ వర్మ.

Exit mobile version