NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా

* నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన

* హైదరాబాద్‌: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ

* ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రుణ మాఫీ, రైతు భరోసాపై బీఆర్ఎస్ పోరు బాటలో భాగంగా.. జిల్లా కేంద్రంలోని రామ్ లీల మైదానంలో బహిరంగ సభ…

* నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న హోం మంత్రి వంగలపూడి అనిత .. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించనున్న అనిత.. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష.. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష..

* విజయనగరం: ఉదయం 10 గంటలకు బోడసింగిపేటలో గల బెల్లాన కన్వెన్షన్ లో పార్టీ సభ్యుత్వ నమోదు, గజపతినగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

* విజయనగరం: నేడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో ఎస్ఎస్ఆర్ పేట చేరుకోనున్న జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.

* తూర్పు గోదావరి జిల్లా: దానా తుఫాన్‌ కారణంగా రాకపోకలు ప్రభావితమవడంతో, రాజమండ్రి, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు.. రాజమండ్రి హెల్ప్ డెస్క్ నెంబర్ 0883-2420541, సామర్లకోట హెల్ప్ డెస్క్ నెంబర్ 0884-2327010, తుని 08854-252172లను సంప్రదించాలని అధికారులు సూచన

* అమరావతి: రేపటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్.. ఒరాకిల్ వంటి పలు ఐటీ సంస్ధలతో పెట్టుబడులపై సమావేశాలు.. 26న భారత కన్సులేట్ జనరల్ తో సమావేశం.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న, అమెజాన్ సహా పలు కంపెనీలతో 29న భేటీ.. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 1,53,919 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 65,660 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి