* ఢిల్లీ: నేడు ఉదయం 9 గంటలకు 10వ “నీతి ఆయోగ్” పాలక మండలి సమావేశం.. “వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047” ఇతివృత్తం (థీమ్) గా “నీతి ఆయోగ్” పాలక మండలి భేటీ.. “ఆపరేషన్ సిందూర్” తర్వాత తొలిసారిగా సమావేశం..
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,374 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 37,477 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు
* హైదరాబాద్: నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన వివరాలు.. ఉదయం 9:30కి అంబర్పేట్ అసెంబ్లీ, నల్లకుంట డివిజన్, సత్య నగర్, రత్న నగర్ బస్తీలను విజిట్ చేయనున్నారు.. సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొంటారు.. బంజారాహిల్స్ తాజ్ దక్కన్ లో ఆర్ట్ గ్యాలరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
* బాపట్ల: ఇవాళ మార్టూరు మండలంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. మార్టూరు మండలం సురవరపల్లిలో క్షేత్రస్థాయిలో పొగాకు నిల్వలు పరిశీలించనున్నారు.. ఎంఎల్ఏపి కంపెనీని సందర్శించి ట్రెస్సింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ తీరును పరిశీలిస్తారు..
* విశాఖ: నేడు ఆర్కే బీచ్ లో “యోగ ఆంధ్రా” కార్యక్రమం… పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 6.30 నుంచి 8.30 వరకు నిర్వహణ.. పాల్గొననున్న హోం మంత్రి అనిత, ఇంఛార్జ్ మంత్రి డోలా..
* విశాఖ: ఇంటర్నేషనల్ యోగా డే కోసం ప్రారంభమైన సన్నాహాలు… ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధాని., వచ్చే నెల 21న ఆర్కేబీచ్ ప్రధాన వేదికగా జరగనున్న కార్యక్రమం.. ప్రధాని పర్యటన, యోగా డే విజయ వంతంపై సమీక్షించనున్న హోం మంత్రి అనిత, ఇంచార్జ్ మంత్రి డోలా…
* విశాఖ: నేడు వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమైక్యతా యాత్ర… పహల్గాం దుశ్చర్య కు పాల్పడ్డ ఉగ్రవాదులను శిక్షించాలని ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఆశీలమెట్ట మీదుగా జివిఎంసి వరకు కొనసాగనున్న ప్రదర్శన… హాజరుకానున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు., కేంద్ర కమిటీ సభ్యుడు లోక నాథం
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
* తిరుమల: ఇవాళ డయల్ యూవర్ ఇఓ కార్యక్రమం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ వాయిదా.. సభకు అనుమతి పిటిషన్ ను హైకోర్టు జూన్ 5 కి వాయిదా వేసిన కారణంగా హైకోర్టు అనుమతి సాధించి అతి త్వరలోనే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తాం హర్షకుమార్
* కాకినాడ: అన్నవరంలో గోత్రనామాలతో జరిగే పూజలను ఆన్ లైన్ లో చూసేలా దేవస్థానం ఏర్పాట్లు..స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు రుసుము చెల్లించి ఆన్ లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్న దేవస్థానం.. ఆన్ లైన్ లో రుసుమ చెల్లించే వారికి రసీదు పైన యూట్యూబ్ లింక్
* విజయవాడ: కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ.. ప్రధాన వైద్యులు వచ్చిన తర్వాత డిశ్చార్జి చేయటంపై నిర్ణయం
* విజయవాడ: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఐపీఎస్ పీఎస్సార్ కస్టడీ పిటిజన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న జిల్లా న్యాయస్థానం
* అమరావతి: ఎన్ కౌంటర్ లో మృతి చెందిన కేశవ రావు, నాగేశ్వర రావు మృత దేహాలు అప్పగించాలని ఏపీ హైకోర్టులో కుటుంబ సభ్యుల అత్యవసర పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో జిల్లా స్థాయి మహానాడు.. హాజరుకానున్న ఎమ్మెల్యేలు.
* నెల్లూరు: కార్యకర్తలకు, ఆత్మకు నియోజకవర్గ ప్రజలకు ఇవాళ అందుబాటులో ఉండనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
* నెల్లూరు: మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు కడపకి వెళ్ళనున్న మంత్రి పొంగూరు నారాయణ
* అనంతపురం : బొమ్మనహల్ మండలం ఉoతకల్లులో రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవం.
* గుంటూరు: నేడు తాడేపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం.
* అన్నమయ్య జిల్లా : నేడు గాలివీడు మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న టిడిపి రాయచోటి నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం…
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: శని త్రయోదశి కారణంగా మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. గోదావరి కాలువలో స్థానాలు ఆచరించి శనేశ్వర స్వామికి తైలాభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు .. శని దోషం నివారణ కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మందపల్లి విచ్చేస్తున్న భక్తులు
* చిత్తూరు: నేటి రాత్రి కుప్పం చేరుకోనున్న సిఎం చంద్రబాబు… రేపు ఉదయం పది గంటలకు సిఎం చంద్రబాబు గృహప్రవేశం.. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురంలో సోంత ఇల్లు నిర్మాణం …. నియోజకవర్గ ప్రజలకు విందు భోజనం.. రాత్రి కి కుప్పానికి నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్
