* ఇవాళ మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మేడారం జాతర ఏర్పాట్లను నేరుగా పరిశీలించనున్న సీఎం.. స్వయంగా సీఎం క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి..
* అమరావతి: ఇవాళ నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం.. లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక చర్చ .. స్వల్పకాలిక చర్చ గా లా అండ్ ఆర్డర్… సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలకు సంబంధించి చర్చ..
* అమరావతి : ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న నాల్గవ రోజు శాసనమండలి సమావేశాలు…
* ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
* అమరావతి : రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం..
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై 2వ రోజు గాయత్రి దేవి అవతరంలో దర్శనం ఇస్తున్న అమ్మవారు.. మొదటి రోజు అమ్మ వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీ శక్తి పథకం ఫ్రీ బస్సు ఉండడంతో భారీగా అమ్మ వారి ఆలయానికి తరలివచ్చిన మహిళలు
* తిరుమల: రేపటి నుంచి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపు మధ్యాహ్నం పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగింపు.. రేపు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి 8 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు.. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: .బ్రహ్మోత్సవాలు సందర్భంగా రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. సిఫార్సు లేఖలు పై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. ఆన్ లైన్ లో 9 రోజులకు సంభందించి లక్షా 16 వేల టిక్కెట్లు జారీ.. సర్వదర్శనం భక్తులకు గరుడ సేవ రోజు మినహా మిగిలిన రోజులో 25 వేల చొప్పున టిక్కెట్లు జారీ చేయనున్న టీటీడీ.
* తిరుమల: రేపు రాత్రి కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. రేపు రాత్రి రచనా అతిథి గృహంలో బస.. ఎల్లుండి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం.. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ప్రత్యేక శిబిరాలు.. నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ శిబిరాలు
* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవి చౌక్ లో రెండో రోజు ఘనంగా దసరా వేడుకలు .. గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు.. గాయత్రి దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులు
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 3,04,506 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,77,625 క్యూసెక్కులు.. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* కర్నూలు: కోడుమూరులో శ్రీ వల్లెలాంబదేవి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు.. నేడు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న వల్లెలాంబదేవి
* కర్నూలు: మంత్రాలయంలో నవరాత్రుల సందర్భంగా నేడు గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమ అర్చన, తులసి అర్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు…. అమ్మవారికి పసుపు కుంకుమ, చీర జాకెట్ గాజులు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకోనున్న మహిళలు.
* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో నేడు రెండవ రోజు శ్రీ గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గా దేవి
* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,681 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,510 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న చిత్తూరు జిల్లా మదనపల్లి వైసిపి నేతలు
* నేడు ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం.. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్న సీఎం.. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను విడుదల చేయనున్న సీఎం.
* హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12 గంటలకి మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు.. 12 గంటల నుంచి ఒకటిన్నర వరకు మేడారం అమ్మవారి గద్దెల విస్తరణ పనుల పై పూజారులతో సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి .. అమ్మవార్ల దర్శనం అనంతరం. మేడారం అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం.. మేడారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
* నిజామాబాద్ : శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద.. 40 వరద గేట్లు ఎత్తివేత.. ఇన్ ఫ్లో లక్షా 46 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2లక్షల 55వేల క్యూసెక్కులు
* కామారెడ్డి : నిజంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత, ఇన్ ఫ్లో 70,787 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 78,446 క్యూసెక్కులు
* నిర్మల్: బాసర లో రెండవ రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు.. బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. నైవేద్యం పులిహోర.
* భద్రాద్రి: నేటి నుంచి భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. అది లక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
