Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్‌కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్‌షా

* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి.. ఆర్ కార్డులు, విమల విద్యాలయం అర్ధాంతరంగా మూసివేత వంటి నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.

* అమరావతి: నేడు రాష్ట్రంలో గ్యాస్ పరిస్థితి, యుద్ధ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గ్యాస్‌ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగించేవారిపై సమీక్ష.. త్వరలో కిరోసిన్‌ పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం.. నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం..

* హైదరాబాద్‌: ఇవాళ ఉదయం 10 గంటకు అసెంబ్లీ ప్రారంభం.. ప్రభుత్వం తరపున రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న మంత్రులు.. తర్వాత బడ్జెట్‌పై చర్చ

* హైదరాబాద్‌: నేడు సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై చర్చించనున్న కేబినెట్‌

* నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో., ప.గో. జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే చాన్స్

* హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని, ఆరు గ్యారంటీ లు అమలు చేయడం లేదని ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన బీజేపీ

* కాకినాడ: నేడు ఇంఛార్జ్‌ మంత్రి నారాయణ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం.. జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించనున్న మంత్రి

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో జూన్ నెల దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల

* విశాఖ: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన.. విశాఖ టీడీపీ కార్యాలయంలో శెట్టిబలిజ నేత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సభలో పాల్గొననున్న లోకేష్.. సాయంత్రం నక్కపల్లి దగ్గర దేశంలోనే అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలో పాల్గొనున్న లోకేష్

* గుంటూరు: రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.

* తూ.గో. జిల్లా: నేడు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ కొవ్వూరు పర్యటన.. సాయంత్రం 4 గంటలకు కొవ్వూరు నియోజవర్గ ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశం.

* గుంటూరు: నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు రానున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్ లో తనను హింసించడంపై విచారణ చేపట్టాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చెయ్యనున్న అంబటి

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,091 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,664 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు

* కర్నూలు: ఆస్పరి మండలం కైరుప్పలలో శ్రీ వీరభద్ర స్వామి కాళికాదేవి రథోత్సవం…

Exit mobile version