* దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ
*ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్.. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* శ్రీ సత్యసాయి : సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
* పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా సాయంత్రం పూర్ణచంద్ర ఆడిటోరియం జరిగే సత్యసాయి విశ్వవిద్యాలయం 44వ కాన్వికేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ , ఏపీ సీఎం చంద్రబాబు.. 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు , 18 మందికి డాక్టరేట్లు ప్రధానం.
* ఇవాళ, రేపు పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి పుట్టపర్తి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రపతితో కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు.. మధ్యాహ్నం పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్న సీఎం..
* మధ్యాహ్నం 3:20కి వేడుకల్లో పాల్గొనేందుకు సత్యసాయి విమానాశ్రయం రానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. సాయంత్రం 4 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి 44వ యూనివర్సిటీ స్నాతకోత్సవం లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వేడుకల అనంతరం రాత్రికి ప్రశాంతి నిలయంలో బస చేయనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్
* ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఎల్లుండి వాయుగుండంగా బలపడే అవకాశం.. నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం
* తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ.. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం.. వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు
* కాకినాడ:రంపచోడవరం ప్రభుత్వ హాస్పిటల్ లో మావోయిస్టు ల మృతదేహాలకు నేడు కూడా కొనసాగనున్న పోస్టుమార్టం.. ఇప్పటివరకు 9 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు.. ఈనెల 18, 19 తేదీలలో జరిగిన ఎన్ కౌంటర్లలో మృతి చెందిన 13 మంది మావోయిస్టులు
* అమరావతి: రాజధాని రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష.. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఆర్డీఏ కార్యాలయంలో రివ్యూ నిర్వహించనున్న పెమ్మసాని. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాజధాని రైతుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, తదితర అధికారులతో పెమ్మసాని సమీక్షా సమావేశం.
* నేడు సిద్దిపేట, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్
* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా లో పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. కొమురం భీం జిల్లాలో 8.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. ఆదిలాబాద్ జిల్లాలో 9.1, నిర్మల్ జిల్లా లో 10.7, మంచిర్యాల జిల్లాలో 12.6 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 9.9 డిగ్రీలుగా నమోదు.. మెదక్ జిల్లా శివంపేటలో 11.6 సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* ఖమ్మం: నేడు వైరాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు కు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
* ఖమ్మం జిల్లా లో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మలపర్యటనలు.. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు
* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనం.. ఉదయం 10.30 గంటలకు పాదాలు పసుపు మండపం నుండి ఊరేగింపు.. సాయంత్రం 4.20 గంటలకు స్వర్ణ రథం.. రాత్రి 7 గంటలకు గరుడసేవ.. సాయంత్రం గరుడవాహన సేవ సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టిన తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు..
* తిరుమల: 17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,098 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,962 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు
