* IPL 2026: ఇవాళ గుజరాత్ వర్సెస్ చెన్నై.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఉదయం ఇటలీ నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ.. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాల మధ్య కీలక భేటీ.. ప్రభుత్వ పనితీరు, అమలు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష
* తమిళనాడు: విజయ్ కేబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు.. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్‌కు మంత్రి పదవులు.. ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న రాజేష్‌కుమార్, విశ్వనాథన్
* ప్రారంభమైన సరస్వతి నదీ అంత్య పుష్కరాలు.. నేటి నుంచి జూన్ 1 వరకు కొనసాగనున్న సరస్వతీ అంత్య పుష్కరాలు..
* వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు జరపాలని సీఎం రేవంత్ ఆదేశం.. ఇవాళ్టి నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద పుష్కరాలు.. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల రాకపోకలకు ట్రాఫిక్ ఆటంకం లేకుండా చూడాలి.. ఎండలు తీవ్రంగా ఉన్నందున భక్తులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచన
* హైదరాబాద్: ఉదయం 10.30కి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు .. తర్వాత సచివాలయం కి సీఎం
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం.. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ.. హాజరుకానున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పాలిట్ బ్యూరో సభ్యులు.. ఉండవల్లి నివాసం నుండి వర్చువల్ గా సమావేశానికి హాజరుకానున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు…
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్న జగన్..
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,315 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 44,107 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు
* కర్నూలు జిల్లాలో ఇవాళ, రేపు మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన.. మైన్స్, ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష.. రేపు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి
* మూడో రోజు ఢిల్లీలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం
* రాజమండ్రి: దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇవాళ రెండో రోజు సాక్షుల విచారణ .. రాజమండ్రి ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసులో నిన్నటి నుంచి ప్రారంభమైన సాక్షుల విచారణ.. మొదటి సాక్షిగా నిన్న కోర్టులో హాజరైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం.. ఇవాళ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి, భార్య, సోదరుడి విచారణ
