Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సెబు ద్వీపంలో భూకంప కేంద్రం.. కూలిన ఇళ్లు ఆఫీసులు.. 22 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదు.. ఎగిసిపడ్డ అలలు, సముద్రతీర ప్రాంతంలో హైఅలర్ట్

* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ

* ఢిల్లీ: నేడు RSS శతాబ్ది ఉత్సవాలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్‌ఎస్‌ఎస్ వారసత్వం, సాంస్కృతిక సహకారాలు, భారతదేశ ఐక్యతను హైలైట్ చేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేయనున్న ప్రధాని మోడీ

* ఏపీ: నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. దత్తిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ

* హైదరాబాద్‌: ఇవాళ స్పీకర్‌ ఛాంబర్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణ.. ఉదయం 11 గంటలకు ప్రారంభకానున్న క్రాస్ ఎగ్జామిన్‌.. కృష్ణమోహన్‌రెడ్డి అడ్వకేట్లను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్న బీఆర్ఎస్‌ ఫిర్యాదుదారుల అడ్వకేట్లు..

* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదోవ రోజు.. ఉదయం రథోత్సవం.. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ.. రేపటితో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు

* విజయవాడ ఇంద్రకీలాద్రి పై పదోవ రోజు దసరా ఉత్సవాలు .. నేడు శ్రీ మహిషాసుర మర్ధని దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. దర్శనానికి రెండు గంటల సమయం

* అన్నమయ్య జిల్లా : నేడు లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరిగే టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
.
*తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు పట్టణం, 18వ వార్డు, తీరుగూడెం నందు ” ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలం, వేమగిరిలో “ప్రైవేట్” కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపేటలో “ప్రైవేటు” కార్యక్రమంలో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో 10వ రోజు శరన్నవరాత్రి వేడుకలు .. మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని రాజమండ్రి – ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభోత్సవం.. అలయన్స్ ఎయిర్ సంస్థ ద్వారా. ఈ విమాన సర్వీసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసు ప్రారంభోత్సవం.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరు

* తిరుపతి: విజయదశమి నేపథ్యంలో స్వీమ్స్ ఓపి,ఓటీలకు రేపు సెలవు ప్రకటించిన అధికారులు

* నెల్లూరు: నేడు జొన్నవాడలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దని అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న కామాక్షితాయి అమ్మవారు

* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ క్షేత్రంలో దేవి శరన్నవ రాత్రి వేడుకల్లో నేడు సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ వల్లెలాంబదేవి..

* పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికి పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం.. ఎల్లుండి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం .. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు ఒకటి,రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు-ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ,

* ఉధృతంగా గోదావరి నది వరద ప్రవాహం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులు.. కూనవరం వద్ద నీటిమట్టం 20.08మీటర్లు .. పోలవరం వద్ద 12.68మీటర్లు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,11,438 క్యూసెక్కులు.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

* నేడు శ్రీశైలంలో దసరా సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి ఏపీ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం రామనారాయరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి..

* నేడు శ్రీశైలంలో 10వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. అశ్వవాహనంపై పూజలందుకోనున్న అది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం

* తిరుమల: 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,275 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,973 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు

* ఏలూరు జిల్లా: రేపటి నుండి ఈ నెల 9 వ తేదీ వరకు ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు .. రేపు స్వామి, అమ్మవార్లను పెండ్లి కొడుకు పెండ్లి కూతుర్లుగా అలంకరించుట, 6న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 7న స్వామివారి రథోత్సవం, 9న ద్వాదశ కోవెల ప్రదక్షణ, పవళింపు సేవతో ముగియనున్న కళ్యాణోత్సవాలు , కళ్యాణోత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు

* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో దుర్గా,పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గామాత

* భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రి మహోత్సవములు ముగింపు దశకు చేరుకున్నాయి.. అమ్మవారి అలంకారంలో భాగంగా నేడు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు.. రేపు సాయంత్రం దసరా మండపంలో జరిగే శమీ పూజ, రామ్ లీలా మహోత్సవంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి

* నిజమాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన.. నగరంలో వివిధ అభివృద్ది పనులకు శంకు స్థాపన చేయనున్న నేతలు

* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పదవ రోజు.. శ్రీ రాజరాజేశ్వరి దేవి సిద్దిదాత్రి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. రాత్రి ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం.. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు రేపు గర్భగుడిలో ఆర్జిత సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు

* అనంతపురం : తాడిపత్రి లో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పదవ రోజు భక్తులకు ప్రత్యేక అలంకారం తో దర్శనమివ్వనున్న దుర్గా దేవి అమ్మవారు.

* అనంతపురం : తాడిపత్రి లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం లో నేడు ద్వజారోహణం, శేష వాహనం.

Exit mobile version