NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేటితో వెయ్యి రోజులకు చేరిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం..

* రెండో రోజు బ్రిటన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. జీ20 సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ

* 500 మార్క్ ను తాకిన ఢిల్లీ వాయు కాలుష్యం.. నేడు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితులు.. కఠిన అంక్షలు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్

* శబరిమలకు పోటెత్తిన భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం.. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూలైన్లు

* నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

* నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సమావేశం

* అమ‌రావ‌తి: 7వ రోజు అసెంబ్లీ స‌మావేశాలు.. ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రశ్నోత్తరాల‌తో ప్రారంభం కానున్న అసెంబ్లీ.

* అమ‌రావ‌తి: ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రశ్నోత్తరాల‌తో ప్రారంభం కానున్న శాస‌న మండ‌లి..

* ప్రకాశం : ఇవాళ మద్ధిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉన్న డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. ఎక్స్ లో అనుచిత పోస్టింగ్ పై టీడీపీ నేత ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు.. వర్మ ఏం చేస్తారనే విషయంపై ఉత్కంఠ..

* అనంతపురం : నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం.

* శ్రీ సత్యసాయి : సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా ప్రశాంతినిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

* అల్లూరి సీతారామ రాజు జిల్లా: పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు… ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు.. ముంచింగిపుట్టు వద్ద 09 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు.. పాడేరు 12, మినుములూరు, ముంచంగి పుట్టులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.

* తూర్పు గోదావరి జిల్లా: నేడు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి లో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ – జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

* హైదరాబాద్‌: 11వ రోజుకు చేరిన భక్తి టీవీ కోటి దీపోత్సవం.. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న నేటి విశేష కార్యక్రమాలు

* హైదరాబాద్‌: నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించే వరకు కాలేజీల బంద్‌.. సెమిస్టర్‌ పరీక్షలు కూడా నిర్వహించబోమంటున్న డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు

Show comments