Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* WPLలో నేడు గుజరాత్‌ వర్సెస్‌ బెంగళూరు.. వడోదర వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* దావోస్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.50 గంటలకకు జ్యురిచ్‌ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు..

* మేడారంలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో ముక్కులు చెల్లింపు..

* 251 కోట్లతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

* హైదరాబాద్‌: నేడు దావోస్ పర్యటనకి బయల్దేరి వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇవాళ రాత్రి దావోస్‌కు రేవంత్.. ఏఐ, సెమీకండక్టర్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, గ్రీన్‌ ఎనర్జీ.. కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ఫోకస్‌

* నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధిర లో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి

* జ్యూరిక్ చేరుకున్న మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్ విమానాశ్రయం వద్ద నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రవాసాంధ్రులు.. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరు కానున్న మంత్రి లోకేష్..

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ నుంచి ఎల్లుండి వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్.. ఎల్లుండి మధ్యాహ్నం లక్కిడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు

* అనంతపురం : కదిరి లో రాష్ట్రస్థాయి యోగి వేమన జయంతి ఉత్సవాలు. హాజరుకానున్న మంత్రులు.

* ఏలూరు జిల్లా: నేటి నుంచి మూడు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన. విదేశీ నిపుణులు నేడు, రేపు నిర్మాణంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ పరిశీలన … గ్యాప్ 1, గ్యాప్ 2 లో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు

* ఆదిలాబాద్: నాగోబా జాతర ప్రారంభం. అర్థరాత్రి పవిత్ర గంగాజలం తో అభిషేకించి నాగోబా మహా పూజ చేసిన మెస్రం వంశీయులు. భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్న మెస్రం వంశీయులు. మహా పూజ తర్వాత కొత్త కోడళ్ల బేటింగ్ పూర్తి. 22 తేదీ న నాగోబా ప్రజా దర్బార్. ఈ నెల 25 వరకు సాగనున్న జాతర.

* ఆదిలాబాద్: నేడు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన. చెన్నూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వివేక్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు. ఆ తర్వాత కొమురం భీం జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.

* నిర్మల్: నేటి నుంచి నిర్మల్ ఉత్సవాలు. నిర్మల్ చారిత్రక నేపథ్యం, గొప్పతనం తెలిసేలా ఏర్పాట్లు.. నేటి నుంచి 5 రోజు ల పాటు ఉత్సవాలు.

* నేడు సంగారెడ్డిలో CITU, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ.. బహిరంగ సభకు హాజరుకానున్న CITU జాతీయ అధ్యక్షుడు సుదీప్ దత్తా.. లేబర్ కోడ్ లు, ఉపాధి హామీ పథకం పేరు మార్పు, విద్యుత్ సవరణ చట్టం, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్

Exit mobile version