Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు భారత్‌-సౌతాఫ్రికా మధ్య ఐదో టీ-20.. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండియా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి

* సుప్రీంకోర్టులో ఇవాళ 10 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న కేసు విచారణ.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిన స్పీకర్‌

* ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న చంద్రబాబు.. ఉదయం 9:45 కు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం.. 10 .45 కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం .. 11:30 కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం .. 12.15 కు శర్వానంద సోనోవాల్ తో సమావేశం.. సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరితో సమావేశం . 5.30 కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశం

* నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణ .. గత గురువారం జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సరెండర్ కావాలని ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు , ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ స్టేటస్ ను పరిశీలించి తదుపరి ఆదేశాలు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన.. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషిస్తారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభిస్తారు.. సాయంత్రం పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొననున్న లోకేష్..

* తూర్పుగోదావరి జిల్లా: రేపు నిడదవోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కొణదల పవన్ కల్యాణ్ పర్యటన .. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు.. రూ.3,050 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,582 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,757 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

* కామారెడ్డి : నేడు ఎల్లారెడ్డి బంద్ కు అఖిలపక్షం పిలుపు.. సోమార్‌పేట్ లో సర్పంచ్ తమ్ముడు చిరంజీవి ఓడిపోయిన అభ్యర్థి కుటుంబం పై ట్రాక్టర్ తో దాడికి నిరసనగా బంద్ కు పిలుపు. ట్రాక్టర్ దాడిలో ఆసుపత్రిలో ఐదుగురికి కొనసాగుతున్న చికిత్స .. ఇంకా విషమంగానే ఇద్దరి పరిస్థితి.

* భద్రాద్రి: రేపటి నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

* విజయవాడ: నేటితో ముగియనున్న లిక్కర్ కేసు నిందితుల రిమాండ్.. 9 మంది నిందితులను ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు

* బెజవాడ పిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పరిణామం.. సరోజినీ గ్యాంగ్ దగ్గర పట్టుబడిన ఐదుగురు పిల్లలు కాకుండా మరొక శిశువు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఈ రోజు ఆ మగ శిశువును బెజవాడ తీసుకురానున్న పోలీసులు

* విజయనగరంలో నేడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పర్యటన.. వి.టి.అగ్రహరంలోని వై జంక్షను దగ్గర ఓ కార్యక్రమంలో పాల్గొననున్న వెంకయ్య

* అనంతపురం : నేటి నుంచి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అనుబంధ అంతర్ కళాశాలల మహిళ క్రీడోత్సవాలు.

Exit mobile version