Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్న అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్.. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి.. బంద్‌ ఫర్‌ జస్టిస్‌ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపు

* తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. హైదరాబాద్‌లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

* నేడు బీసీ సంఘాల జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్‌.. ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్న BRS బీసీ నేతలు.. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్ లో పాల్గొననున్న నేతలు.. మండల, జిల్లా స్థాయిలో బంద్ లో పాల్గొనాలని BRS కార్యకర్తలకు పిలుపునిచ్చిన అధిష్టానం

* తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. హైదరాబాద్‌లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

* అమరావతి: ఇవాళ ఉద్యోగ సంఘ ప్రతినిధుల తో మంత్రులు సమావేశం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల తో మంత్రులు పయ్యావుల కేశవ్..సత్యకుమర్.. నాదెండ్ల మనోహర్ చర్చలు… ఉద్యోగుల ఆర్ధిక పరమైన అంశాలకు సంబంధించి చర్చ.. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం లో చర్చలు

* బాపట్ల : కొరిశపాడు మండలం మేదరమెట్లలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..అనంతరం అద్దంకిలో బాలికలకు ఉచిత సైకిళ్ళ పంపిణీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రవికుమార్..

* ప్రకాశం : సింగరాయకొండలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం, మరియు పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటితో నేత్రపర్వంగా ముగియనున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు .. ముగింపు రోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు .. చివరగా చక్రస్థానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

* తిరుమల: రేపటి నుంచి 25వ తేది వరకు జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టిటిడి.. రేపు ఉదయం 10 గంటలకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు,అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టిటిడి

* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,675 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,681 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు

* నెల్లూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమాల వివరాలు.. ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం, V.L.పురం, పాత లారీ స్టాండ్ వద్ద “చెట్లు పెంపకం” కార్యక్రమంలో.. మధ్యాహ్నం 12 గంటలకు రాజమహేంద్రవరం, కొత్తపేట, రౌతు తాతాలు కల్యాణ మండపం నందు “ప్రైవేట్” కార్యక్రమంలో.. మధ్యాహ్నం 3 గంటలకు పెరవలి మండలం, పెరవలి జంక్షన్ నందు NH-16 నుండి కొత్తపల్లి అగ్రహారం వెళ్లే కనెక్టివిటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం.. సాయంత్రం 4 గంటలకు పెరవలి మండలం కానూరు గ్రామంలో సొసైటీ బిల్డింగ్ నందు “డివిడెంట్స్ పంపిణీ” కార్యక్రమంలో పాల్గొంటారు.

* నంద్యాల: నేడు నందమూరి నగర్ , ఆటో నగర్ లలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి ఫరూక్

* నంద్యాల: నేడు డోన్ ఎక్సైజ్ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల వేలం పాట..

* కర్నూలు: మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, పుష్పర్చన,కుంకుమ అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విశేష పూజలు… సాయంత్రం స్వామి వారిని రథంపై ప్రాకారం చుట్టూ ఊరేగింపు.

Exit mobile version