Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.. అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్‌

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌.. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్‌ కార్యాలయం పిటిషన్‌.. అన్ని కేసులపై నేడు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

* ఏపీలో నేటి నుంచి ఈ నెల 26 వరకు స్కూళ్లలో ఆధార్‌ స్పెషల్‌ క్యాంపులు.. 5-15 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్‌, ఇతర వివరాలు అప్డేట్‌ చేసుకునేందుకు వీలుగా క్యాంపులు.. ఏపీలో ఇప్పటికి 15.46 లక్షల మంది పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉందన్న అధికారులు

* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.35 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* తిరుమల: రేపు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం .. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల జారీ విధానంపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి

* తిరుమల: రేపు ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. రేపు ఉదయం లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకునే వెసులుబాటు.. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు

* తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం…. రాత్రి చిన్నశేష వాహనం పై తిరుమాఢ విధుల్లో విహరించనున్న పద్మావతి అమ్మవారు‌… బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్ధిక సేవలను రద్దు చేసిన అధికారులు

* కాకినాడ: హిందూపురంలో పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ నేడు వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన కార్యక్రమం, పాల్గొనున్న నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు

* తూర్పుగోదావరి జిల్లా: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో రాజమండ్రి వద్ద వేలాదిగా పుణ్యస్థల ఆచరిస్తున్న భక్తులు.. భక్తులు కొన్ని స్నానాలతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న గోదావరి తీరం.. భక్తులు, అయ్యప్ప స్వామి మాలదరణ భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

* విశాఖపట్నం: నేడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మికులు ధర్నా.. ఉత్పత్తిపై జీతాలు చెల్లిస్తామని చెప్పడంపై వ్యతిరేకత…

* తిరుపతి: నేడు సిట్ కస్టడికి వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న.. కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయినా చిన్న అప్పన్నను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నెల్లూరు ఏసీబీ కోర్టు..

* శ్రీ సత్యసాయి : హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బాలకృష్ణ చేతుల మీదుగా 38 మందికి 45 లక్షల రూపాయల విలువైన CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం.

* శ్రీ సత్యసాయి : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షి శ్రీ దుర్గా పాపనాగేశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఏడు పడగల నాగేంద్రుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు

* తిరుమల: 22 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,004 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు

* శ్రీసత్యసాయి : పుట్టపర్తి లో పర్యటించనున్న రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ .. రేపు అధికారాలతో సమీక్షా సమావేశం.

* నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎర్రుపాలెం ( మం) జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కవిత…

* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం..

Exit mobile version