Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట.. నయా భారత్‌ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

* నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. విజయవాడలో ఇవాళ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

* విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

* హైదరాబాద్‌: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు గోల్కొండ కోటపై జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

* ప్రకాశం : ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, హాజరుకానున్న కలెక్టర్ తమీమా అన్సారియా.. అనంతరం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో స్త్రీ శక్తి పథకం బస్సులను ప్రారంభించనున్న మంత్రి స్వామి..

* బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చీరాల బస్టాండ్ ఆవరణలో స్త్రీ శక్తి పథకం బస్సులను ప్రారంభించనున్న మంత్రి రవి కుమార్..

* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు.. ఉదయం 08:30 గంటలకు రాజమహేంద్రవరం, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందు “స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు” కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 05:00 గంటలకు రాజమహేంద్రవరం, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద “స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 6 గంటలకు నిడదవోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద “స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

* గుంటూరు: నేడు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనున్న మంత్రి నారా లోకేష్

* విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవాళ ఉదయం 9 గంటలకు జెండా వందనం చెయ్యనున్న సీఎం చంద్రబాబు

* ఏపీ సచివాలయం బ్లాక్ 1 దగ్గర. ఉదయం 7 30 కు జెండా వందనం చెయ్యనున్న సీఎస్ విజయానంద్…

* అమరావతి: శాసన మండలి దగ్గర 8 గంటలకు జెండా వందనం చెయ్యనున్న మండలి చైర్మన్ మోషేన్ రాజు

* శాసన సభ దగ్గర ఉదయం 8.15 కు జెండా వందనం చెయ్యనున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

* ఏపీ హై కోర్ట్ దగ్గర ఉదయం 10 గంటలకు జెండా వందనం చెయ్యనున్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్…..
తిరుపతి

* నేడు తిరుపతి తారకరామ స్టేడియంలో లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనున్న మంత్రి ఆనం

* తిరుపతి: టీటీడీ పరిపాలన భవనం గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. పాల్గొనున్న టీటీడీ ఉన్నతాధికారులు

* అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పధకం స్త్రీ శక్తి ప్రారంభం.. సూపర్ సిక్స్ లో కీలక పధకం అమలు చెయ్యనున్న ఏపీ ప్రభుత్వం.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

* అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* సత్య సాయి జిల్లాలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనున్న మంత్రి సవిత.

* కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో 9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్ కి కాకినాడ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం

* అనంతపురం : ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

* అమరావతి: మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్,పార్టీ నేతలు,కార్యకర్తలు

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,530 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,478 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు

* నెల్లూరు: ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ లో మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా స్త్రీ శక్తి పథకం ప్రారంభం.. సాయంత్రం ఐదు గంటల తర్వాత అమల్లోకి రానున్న మహిళలకు ఉచిత ప్రయాణం

* నెల్లూరు: పొదలకూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణ, బుచ్చిలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డీ, ఇతర ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా పథకం ప్రారంభం

* నెల్లూరు: 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన పోలీస్ పెరేడ్ గ్రౌండ్.. జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించనున్న మంత్రి.. విశిష్ట సేవలు అందించిన 332 మంది ప్రభుత్వం ఉద్యోగులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా పురస్కారాలు..

* శ్రీ సత్యసాయి : హిందూపురం నియోజవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన నున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. MGM క్రీడా మైదానం లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. హిందూపురం MRO కార్యాలయందగ్గర ట్రాఫిక్ police స్టేషన్ లో Police Command Control Room ప్రారంభోత్సవం. రంగనాథ స్వామి దేవాలయం వద్ద గుడ్డం కోనేరు పునరుద్ధరణ పనులకు భూమి పూజ కార్యక్రమం.

* హిందూపురం APSRTC బస్టాండ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా మహిళల కు బస్సు లో ఉచిత ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటిలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…

* నేడు సిద్ధిపేటలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు

Exit mobile version