Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీరు విడుదల.. ఇన్ ఫ్లో 1,17,221 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,52,840 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* కడప: నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌.. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ వర్సిటీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు.. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్‌కు 10 టేబుళ్ల చొప్పున ఏర్పాటు..

* వికారాబాద్‌ జిల్లా పరిగిలో భూ ప్రకంపనలు.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కంపించిన భూమి.. పరిగి మండలం పరిసరప్రాంతాల్లో ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

* ప్రకాశం బ్యారేజి కి పెరుగుతున్న వరద.. 70 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,50,240 క్యూసెక్కులు.. బ్యారేజీ వద్ద నీటి మట్టం 13 అడుగులు..

* శ్రీ సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్న ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ. నేడు చిలమత్తూరు మండలం MJP గురుకుల పాఠశాల టేకులోడు లో 8 కోట్ల 60 లక్షల  రూపాయల తో కొత్తగా నిర్మించిన లాబ్స్ , విద్యార్ధినుల వసతి గృహల ప్రారంభోత్సవం. పూలకుంట గ్రామం లో సూర్య ఘర్ పథకం  ప్రారంభోత్సవ కార్యక్రమం. చెరువులు నింపడానికి తీసుకోవాల్సిన చర్యల పై  HNSS అధికారులు,  ఇంజనీర్ల తో సమీక్షా  సమావేశం. హిందూపురం పట్టణంలోని సూరప్ప కుంట సుందరీకరణ గురించి జిల్లా ఫారెస్ట్  అధికారుల తో సమీక్ష.

* అనంతపురం : ఈనెల 25న అనంతపురంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈనెల 25న అనంతపురంలో మహిళలతో భారీ ఎత్తున స్త్రీ శక్తి సభ నిర్వహించేందుకు సన్నాహాలు.

* అమరావతి: అల్పపీడనం ప్రభావంతో ఇవాళ చెదురుమదురుగా భారీ వర్షాలు.. అల్లూరి, కోనసీమ, ఏలూరు,ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

* కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు,లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి-రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

* అమరావతి: ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని ముఖ్య శాఖలకు సంబంధించి సమీక్ష.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. వరదలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.

* ఖమ్మం: నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ల పర్యటన

* నారాయణపేట జిల్లా: ఎగువ కర్ణాటక రాష్ట్రాలతో పాటు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు.. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు..

* భద్రాద్రి భద్రాచలం వద్ద గోదావరి 18 అడుగులకు చేరిక.. ఖమ్మం వద్ద మన్నేరు 9.5 అడుగులకి చేరిక

* అమరావతి : ఇవాళ అనంతపురం పర్యటనకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొననున్న జగన్‌..

* విజయనగరం.. నేడు కలెక్టరేట్ లో డీఆర్సీ సమావేశం.. హాజరు కానున్న జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనిత…

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11:00 గంటలకు నిడదవోలు జగనన్న కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

Exit mobile version