* ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సమావేశానికి హాజరుకానున్న సీఎం
* విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీ.. డ్రైవింగ్ చేంజ్ – యాక్సిలరేటింగ్ ది గ్రీన్ షిఫ్ట్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం.. సాయంత్రం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే వైజాగ్ ఎకనమిక్ రీజియన్ రిపోర్ట్ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు
* విశాఖలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటన.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి
* ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ పోస్ట్.. వివరాలు ఇవాళ ఉదయం 9 గంటలకు అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన లోకేష్..
* అన్నమయ్య జిల్లా: నేడు మదనపల్లెలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. మదనపల్లె టమోటా మార్కెట్ ఛైర్మెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్న నాదెండ్ల
* అమరావతి : ఇవాళ ఇబ్రహీంపట్నంలో వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 5.30 గంటలకు ఇబ్రహీంపట్నంలోని సీఏ కన్వెన్షన్ చేరుకోనున్న జగన్.. 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు మంగునూరు కొండారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్న జగన్.. 5.45 గంటలకు బయలుదేరి 6.15 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్న జగన్.
* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని జన్మ నక్షత్రం సందర్భంగా సత్య దీక్షలు విరమణలు.. 9, 18, 27 రోజులు దీక్ష చేసిన స్వాములు దీక్ష విరమణకు వార్షిక కళ్యాణ మండపం వద్ద ఏర్పాట్లు.. స్వామివారి దర్శనానికి రద్దీ, క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులు
* తూర్పుగోదావరి జిల్లా: రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్ దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు ఈనెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. నవంబర్, డిసెంబర్‌కు సంబంధించి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచన
* నేడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బంద్.. ఓ విద్యార్థి సంఘం నాయకులు చందాల కోసం వెళ్లి స్కూల్ యాజమాన్యం పై దాడి.. సీసీ కెమెరాలలో రికార్డు అయిన దాడి దృశ్యాలు.. విద్యార్థి సంఘం నాయకుల పై హనుమకొండ PS లో కేసు నమోదు.. విద్యార్థి సంఘాలు చందాల దందా నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పాటిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు
* పార్వతీపురం మన్యం జిల్లా: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సoధ్యరాణి నేడు షెడ్యూల్.. ఉదయం 9గంటలకు cmrf చెక్కుల పంపిణీ.. 9.15నిమిషాలకి సాలూరు మార్కెట్ యార్డ్ లో దాన్యం కొనుగోలు కేద్రం ప్రారంభం. 11గంటలకు విశాఖపట్నం సీఎం చంద్రబాబు ప్రోగ్రాంలో పాల్గొనున్న మంత్రి సంధ్యా రాణి
* తిరుమల: 10 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,283 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,583 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.54 కోట్లు
* నేడు ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పర్యటనలు
