NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ.. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ కొడుకు పుట్టినరోజు వేడుకలకు హాజరు.. నేడు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీకానున్న ప్రధాని నరేంద్ర మోడీ

* ఢిల్లీ: నేడు పార్లమెంట్‌ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు

* ఢిల్లీ: వక్ఫ్‌ బిల్లుపై నేడు లోక్‌సభకు పార్లమెంటరీ కమిటీ నివేదిక..

* సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్‌.. ఉదయం 11.15కి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవం.. 12.30కి T-Hubలో Googleతో అవగాహన ఒప్పందం.. మధ్యాహ్నం 1కి నానక్ రామ్‌గూడ HGCLలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష సమావేశం.. సాయంత్రం 5 గంటలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై అధికారులతో సమీక్ష

* అమరావతి : ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశాలు..

* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..

* తిరుమల: రేపు టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం..

* ప్రకాశం : ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్షా సమావేశం, హాజరుకానున్న జిల్లా లోని ఎస్సై, సీఐ, డీఎస్పీలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు.. పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిక్షణపై పోలీస్ అధికారులతో సమీక్షించనున్న ఎస్పీ దామోదర్..

* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* గుంటూరు: నేటి తో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు… కృష్ణ ,గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నామినేషన్ ఉపసంహరణకు , మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు.. నామినేషన్లు ఉప సంహరించుకునేందుకు ,తెర వెనుక జరుగుతున్న రాజకీయం..

* తూర్పు గోదావరి జిల్లా: నేడు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు తో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ

* ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం చిల్లకళ్లులో నేడు కృష్ణ – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ టీడీపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఎన్నికల సమావేశం.

* అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. చిలకలూరిపేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని పిటిషన్

* విజయవాడ పర్యటనలో మంత్రులు పయ్యావుల కేశవ్

* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్

* నంద్యాల: జంబులాపరమేశ్వరి తిరుణాల సందర్భంగా నేడు గాడిదల పోటీలు..

* నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయనున్న మంత్రి ఫరూక్

* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొండపాడు గ్రామంలో పారు వేట, అశ్వ వాహనం స్వామి వారికి ఊరేగింపు.

* నంద్యాల: నేడు శ్రీశైలంలో గురువారం సందర్భంగా త్రిఫల వృక్షం వద్ద కొలువుదిర్చిన శ్రీ దత్తాత్రేయస్వామికి ప్రత్యేక అభిషేకం, పూజలు

* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,270 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,175 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు

* పల్నాడు: ధరణికోటలో నేడు రెండవ రోజు కొనసాగనున్న, అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్రస్థాయి సమావేశం… భవిష్యత్తు కార్యాచరణ పై నేడు నిర్ణయం తీసుకోనున్న బాధితులు..