* నేడు ఖమ్మం నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొల్లూరు మండలం తడికలపూడి, కిష్కింధ పాలెం ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. లంక గ్రామాలలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్న సీఎం.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం
* హైదరాబాద్: నేడు బీజేఎల్పీ సమావేశం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువుల సందర్శన, అసెంబ్లీ కమిటీల నిర్ణయాలు వంటి అంశాలపై చర్చ..
* అమరావతి: అగ్రిగోల్డ్ భూముల పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. అగ్రిగోల్డ్ భూముల అమ్మకంపై ఏపీ హైకోర్టులో ఏసీబీ పిటిషన్లు..
* నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు.. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు
* ఏపీ: నేడు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన..
* నేడు సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
* భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44.30 అడుగులు… కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
* విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
* బాపట్ల : అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులు ప్రారంభించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనంతసాగరం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.30 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవాహం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేత.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు.. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తే వెనక్కి తిప్పి పంపుతామని హెచ్చరిక.. రేపటి నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి
* తిరుమల: అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు వేద్వత్త్ సదస్సులు.. నాదనీరాజన మండపంలో 9 రోజులు పాటు సదస్సు నిర్వహిస్తున్న టీటీడీ
* అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి రెండు మ్యాచ్‌లు. ఇండియా టీం – ఏ వర్సెస్ ఇండియా టీం-డీ… ఇండియా టీం – బీ వర్సెస్ ఇండియా టీం- సీ.