Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* మహిళల వన్డే వరల్డ్‌ కప్‌: నేడు శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్.. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్

* ఢిల్లీ: ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ.. తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపైనా చర్చించే అవకాశం

* నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు.. హైకమాండ్‌ పెద్దలతో భేటీ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చ

* విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిపై దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం.. ఉదయం 9.55కి ప్రమాణస్వీకారం చేయనున్న ధర్మకర్తల మండలి సభ్యులు

* నేడు కోయంబత్తూరుకు కేటీఆర్.. ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్

* బాపట్ల : జే పంగులూరు మండలం కొండమంజులూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. అనంతరం బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు, సంతమాగులూరు మండలం అడవిపాలెంలో పర్యటించనున్న మంత్రి రవి కుమార్..

* చిత్తూరు: జీడీ నెల్లూరు దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలినకు హోం మంత్రి అనిత.. ఎమ్మెల్యేలు… నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట సభను నిర్వహించనున్న హోంమంత్రి

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిధి గృహం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,468 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,878 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు

* చిత్తూరు: నేడు తోతాపూరి మామిడి రైతులకు 183 కోట్లు సబ్సిడీ జమ చేయానున్న ప్రభుత్వం… చిత్తూరు ,తిరుపతి ,అన్నమయ్య జిల్లాలో దాదాపు డెబ్బైవేలమంది తోతాపూరి రైతులకు 183 కోట్లు జమ చేయానున్న అధికారులు

Exit mobile version