* టర్కీలోని బాలికేసిర్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదు.. భూకంపం ధాటికి నేలమట్టమై 16 భవనాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
* నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్.. ఫిలిం ఫెడరేషన్ ప్రకటన.. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్.. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం.. నేటి నుంచి ఎక్కడిక్కక్కడే నిలచిపోనున్న షూటింగ్స్
* అమరావతి: ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష. సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఏపీ సీఎం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో స్థానిక సంస్థల ఉపఎన్నికలపై సమీక్షించే అవకాశం..
* నెల్లూరు: నియోజకవర్గంలోని పలు మునిసిపల్ హైస్కుల్స్ ని పరిశీలించనున్న మంత్రి నారాయణ.. ప్రభుత్వ స్కూల్స్ ని CSR ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు..
* తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు
* అనంతపురం : నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధన ఉత్సవాలు ప్రారంభం.. నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న స్వామివారి ఆరాధన ఉత్సవాలు.
* అనంతపురం : నగరంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నేడు హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకు కొనసాగుతున్న బైక్ ర్యాలీ.
* కడప : రేపు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు… ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేటి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలీసు సామాగ్రి సిబ్బంది…
* కడప: రేపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు.. పులివెందుల ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు… మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10601 మంది ఓటర్లు… ఒంటిమిట్టలో ఎన్నికల బరిలో ఉన్న 11 మంది అభ్యర్థులు.. మొత్తం 17 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. ఒంటిమిట్టలో 24606 మంది ఓటర్లు.. సాయంత్రం కు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న పోలింగ్ సిబ్బంది
* నేడు ములుగు జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క పర్యటన.. ములుగు మండలం ఇంచర్లలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయనున్నా మంత్రులు. అనంతరం కలెక్టరేట్ లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.
* నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. 8 క్రస్ట్ గేట్ లు 5 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 65,800 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 110321 క్యూసెక్కులు ..
* కరీంనగర్: నేడు జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి పర్యటన.. కరీంనగర్ లో సుడా ఆధ్వర్యంలో నిర్మించబోయే వాణిజ్య సముదాయనికి శంకుస్థాపన చేయనున్న మంత్రులు.. మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి శ్రీధర్ బాబు
* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ.. కేసులో ఏ35 బాలాజీ యాదవ్, ఏ36 నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లు మీద నేడు వాదనలు.. రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్లు మీద నేడు సిట్ కి నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు..
* సారథ్యం యాత్ర లో బాగంగా నేడు చిత్తూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటన..
* గుంటూరు: నేడు తాడేపల్లి ఇంటర్మీడియట్ కమిషనరేట్ వద్ద కాంట్రాక్ట్ లెక్షరర్ల ధర్నా.. జీవో నెంబర్ 114ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్
* హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నేడు ఈడీ విచారణకు హీరో రానా.. నేడు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు..
* అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతులతో ట్రాక్టర్ ర్యాలీలకు టీడీపీ పిలుపు.. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నిధులు జమ అయిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు నియోజకవర్గాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు
