NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రీ బూస్టర్‌ డోసు

* లార్డ్స్‌ వన్డేలో భారత్‌ పరాజయం, భారత్‌పై 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

* నేడు విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన… ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. వాహన మిత్ర లబ్ధిదారులకు 4వ విడత నగదు బదిలీ చేయనున్న సీఎం.

* విశాఖ పర్యటన అనంతరం రాజమండ్రికి చేరుకోనున్న సీఎం జగన్… వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే… అనంతరం రాజమండ్రి ఎయిర్ పోర్టులో సమీక్ష

* కాకినాడ: నేటి నుంచి రెండు రోజులు పాటు కాకినాడ జేఎన్టీయూ ప్లాటినం జూబ్లీ వేడుకలు, యూనివర్సిటీ ఏర్పడి 75 ఏళ్ళు అయిన సందర్భంగా కార్యక్రమం

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను హాజరుపర్చనున్న పోలీసులు, నేటితో ముగియనున్న అనంతబాబు రిమాండ్

* నెల్లూరు: ఉమ్మారెడ్డిగుంటలో మురుగునీటి కాలువల నిర్మాణానికి ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన

* నెల్లూరు: సీతారామపురం మండలంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

* సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం

* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు 41వ డివిజన్ జనశక్తి నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.

* అనంతపురం: నగరంలో భాజపా నాయకుల జన జాగృతి యాత్ర ప్రారంభం హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి

* తూర్పుగోదావరి జిల్లా : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి వరద ఉధృతి, బ్యారేజీ వద్ద 17.20 అడుగులకు చేరిన నీటిమట్టం, బ్యారేజీ నుండి 18 లక్షల 25 వేల క్యూసెక్కులు వరద నీరు సముద్రంలోకి విడుదల , 17.75 అడుగులకు నీటిమట్టం చేరితే మూడోవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న ఇరిగేషన్ అధికారులు

* అల్లూరి జిల్లా జల దిగ్భంధంలో విలీన మండలాలు.. పూర్తిగా నీట మునిగిన కూనవరం.. మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. కనీసం రక్షించడానికి మరబోట్లు కూడా లేవని గగ్గోలు పెడుతున్న బాధితులు.. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలా చిక్కుకుపోయామంటూ గగ్గోలు..

Show comments