NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వర్షాలు, ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక.

* బాపట్ల : చీరాల మండలం పాత చీరాలలో శ్రీ అద్దంకమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం..

* కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 51 లంకలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఇప్పటికే 31 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పి. గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, ఐ పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ఆయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం ఎక్కువ

* నెల్లూరు : గుడ్లూరు మండలం గుండ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి..

* ప్రకాశం : టంగుటూరు శ్రీనివాసనగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జీ అశోక్ బాబు..

* నెల్లూరు రూరల్ మండలం ఏ.వి.నగర్ లో రూ.62 లక్షలతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్న ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* నెల్లూరు: ఉదయగిరి నారాయణ అనే దళితుడి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో చలో నెల్లూరు కార్యక్రమం

* నెల్లూరు: ఏ.ఎస్.పేట మండలంలో ఎం.ఎల్.ఏ. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎం.ఎల్.ఏ.ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం

* తిరుపతి జిల్లా గూడూరు రూరల్ లో ఎం.ఎల్.ఏ.వరప్రసాద్ ఆధ్వర్యంలో గడపగడప కూ ప్రభుత్వం కార్యక్రమం

* తూర్పుగోదావరి జిల్లా గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

* తిరుమలలో 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయ్పస్వామి

* తిరుమలలో నగదు చెల్లింపులు బదులుగా యూపీఐ విధానాని అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, పైలట్ ప్రాజెక్టు క్రింద గదులు కేటాయింపు కౌంటర్ల వద్ద యూపీఐ విధానాని ప్రవేశ పెట్టిన టీటీడీ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యాటించనున్న హోం శాఖ మంత్రి తానేటి వనిత

* సత్య సాయి జిల్లా – నేడు రొద్దం మండలం వైటి పల్లి గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ.

* అనంతపురం : పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం.. హాజరుకానున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

* అనంతపురం : కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి, ఓపిగానిపల్లి గ్రామాల్లో నేడు గడపగడపకు మన ప్రభుత్వం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.