PM Modi: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మారోసారి టార్గెట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినదంతా.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేదని అన్నారు.. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు, సామాజిక సంస్కర్త పట్ల ఆ పార్టీ దారుణంగా ప్రవర్తించిందన్నారు.. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు.. అంబేద్కర్‌ను ఓడించేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు.. కానీ, ఇప్పుడు ఓట్ల కోసం జై భీమ్ నినాదాలు చేస్తోంది.. కాంగ్రెస్ రంగులు మార్చే పార్టీ అని దుయ్యబట్టారు.. ఎస్సీ, ఎస్టీల ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంబేద్కర్ తొలగించాలని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయిందన్నారు..
Read Also: Plane Crash: మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
కాంగ్రెస్ బీఆర్ అంబేద్కర్‌తో దారుణంగా వ్యవహరించింది… వారు ఆయనను వ్యతిరేకించారు.. బాబాసాహెబ్ చెప్పినదంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించేది అని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిదానికీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయి.. వాటిని ధృవీకరించవచ్చన్న ఆయన.. ఎన్నికల్లో బాబాసాహెబ్ ఓడిపోయేలా కాంగ్రెస్ ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదన్నారు.. ఎందుకంటే వారు ఆయనను సహించలేకపోయారు… భారతరత్నకు ఆయన అర్హుడని భావించలేదు అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. సబ్ కా సాత్ కాంగ్రెస్‌కు సాధ్యం కాదు అని స్పస్టం చేశారు.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థం కాని విషయం అని పేర్కొన్నారు.. కాంగ్రెస్ విషయానికొస్తే… వారు సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ఆశించడం పెద్ద తప్పు… అది వారి ఆలోచనలకు అతీతమైనది.. వారి రోడ్ మ్యాప్ కు కూడా సరిపోదు.. ఎందుకంటే అది ఒక పెద్ద పార్టీ.. ఒక రాజవంశానికి అంకితం చేయబడింది కాబట్టి.. వారికి సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సాధ్యం కాదు అని విమర్శించారు..
Read Also: Accident : పెద్దఅంబర్ పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
మేం స్కిల్ డెవలప్‌మెంట్‌తో వెనుకబడి వర్గాల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం.. విశ్వకర్మ యోజనతో చేతివృత్తులవారి అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం అన్నారు మోడీ.. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం చేసిన పేదలను మేం గౌరవిస్తున్నాం.. పేదల అభివృద్ధే మా ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.. కేవలం అర్హులకే లబ్ధి చేకూరేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం.. పదేళ్లలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మార్పును గమనిస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేస్తున్నాం.. ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు.. మేం వచ్చాక ఓబీసీల డిమాండ్‌ను నెరవేర్చాం.. దేశంలో దివ్యాంగుల గురించి మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం.. దివ్యాంగుల కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టాం.. ట్రాన్స్‌జండర్స్ గౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు ప్రధాని మోడీ..