NTV Telugu Site icon

Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..

Yogi

Yogi

Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి తీస్తోందని అన్నారు.

Read Also: Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!

మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది… ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యోగి విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమణలు, దుర్వినియోగం నుంచి విముక్తి చేయడం, సమాజ సంక్షేమం కోసం వాటిని ఉపయోగించుకోవడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, దేశ ప్రయోజనాలకు ముస్లిం సమాజానికి ఇది చాలా అవసరమని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆస్తులపై స్థిరపడిన వారికి, వక్ఫ్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సమస్యలు తప్పవని యోగి హెచ్చరించారు.

ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేయడానికి వక్ఫ్ బోర్డు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని యోగి ఆరోపించారు. భూమి సేకరించడానికి వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాన్ని ఆయన ప్రశ్నించారు. వారు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఆస్తులు, ప్రభుత్వ భూములను ఎలాంటి ఆధారాలు లేకుండా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వేరే భూమిని తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.?? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో జరగదని యోగి చెప్పారు.